Saturday, November 30, 2024

Creating liberating content

తాజా వార్తలుఅంకితభావంతో ప్రజాసేవ

అంకితభావంతో ప్రజాసేవ

వాలంటీర్లు మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది:
తుడా ఛైర్మెన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి

  • అట్టహాసంగా ‘వాలంటీర్లకు వందనం ‘ కార్యక్రమం
  • 2010 మందితో కిక్కేరిసిన ఎస్వీ ఆడిటోరియం

తిరుపతి రూరల్,

    రాష్ట్రంలో వాలంటీర్లు దేవుడు రూపంలో ప్రజలకు సేవ చేస్తున్నారని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా రూపొందిన ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి గడపకు చేరవేయడంలో వాలంటీర్లు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారని తుడా ఛైర్మెన్, చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పేర్కొన్నారు. అంకితభావంతో ప్రజా సేవకు సంకల్పిస్తుండటం అభినందనీయమన్నారు. నిత్యం ప్రజలతో మమేకమవుతూ ప్రభుత్వానికి, ప్రజా ప్రతినిధులకు, ప్రజలకు వారధిగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. ఆదివారం ఎస్వీ ఆడిటోరియం వేదికగా ‘వాలంటీర్లకు వందనం’ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. చంద్రగిరి నియోజకవర్గం పరిధిలో 2,010 మంది వాలంటీర్లతో ఎస్వీ ఆడిటోరియం కిక్కేరిసింది. ‘వాలంటీర్లకు వందనం’ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రతి ఒక్క వాలంటీర్ కు సేవా మిత్ర పురస్కారం స్వయంగా అందజేసి దుశ్శాలువతో సత్కరించారు. హాట్ బాక్స్, డిన్నర్ సెట్ ను బహుమానంగా అందజేశారు. అంతకుముందు ప్రతి ఒక్క వాలంటీర్ ను పేరు పేరున పలకరించారు. వారికి వినమ్రంగా నమస్కరించి అభిమానం చాటుకున్నారు. తుడా వీసీ వెంకట నారాయణ, డీఎల్ డీవో సుశీలాదేవీ, ఆరు మండలాలకు చెందిన ఎంపిడిఓ లు హాజరయ్యారు.

   ఈ సందర్భంగా ముఖ్య అతిధి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మాట్లాడుతూ.. వాలంటరీ వ్యవస్థకు ఆజ్యం పోసిన సీఎం జగన్మోహన్ రెడ్డిని తిరిగి గెలిపించుకునేందుకు నేను సిద్ధం.. మీరు సిద్దమా అంటూ పిలుపునిచ్చారు. గ్రామ స్వరాజ్యానికి వాలంటీర్ వ్యవస్థ పునాదిగా నిలుస్తుందన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో ప్రజల పట్ల వాలంటీర్లుగా మీరు చూపుతున్న ఆత్మీయత, ప్రేమ మరువలేనిదన్నారు. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిదన్నారు. ప్రజా సేవకై రూపొందిన వాలంటీర్ వ్యవస్థ దేశంలో ఎక్కడా లేదన్నారు. వాలంటీర్ సైనికులు చరిత్రలో నిలిచిపోతారని వెల్లడించారు. నిస్వార్ధంగా చేస్తున్న సేవా నేపథ్యంలో విమర్శకులను పట్టించుకోవద్దన్నారు.

ప్రజా సేవలో మీ భాగస్వామ్యం అభినందనీయమని కొనియాడారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన నియోజవర్గ ప్రజలను కుటుంబ సభ్యులుగా భావించి సేవ చేస్తుంటే.. మీరు మీ పరిధిలోని కుటుంబ సభ్యులకు ప్రభుత్వపరంగా సేవ చేసే భాగ్యం లభించడం అదృష్టంగా భావించాలన్నారు. అవ్వ, తాతలకు సకాలంలో పింఛన్ల పంపిణీలో మీ చొరవ ప్రశంసనీయమన్నారు. ఆదర్శ గ్రామాల నిర్మాణంలో వాలంటీర్లు బాసటగా నిలుస్తున్నారన్నారు. కరోనా కాలంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేపట్టిన ప్రజా కార్యక్రమాల్లో మీ కృషి, భాగస్వామ్యం ఎనలేనిదన్నారు. నాలుగు సంవత్సరాల 10 నెలల కాలంలో కుటుంబ సభ్యుల్లా కలిసిమెలసి ప్రజలకు సేవ చేయడం చారిత్రాత్మకమన్నారు. ఆయా గ్రామాల్లో మీకు కేటాయించిన 50 ఇళ్లలో అవ్వా, తాత, అక్కా, చెల్లి, చిన్నమ్మ పెద్దమ్మ, చిన్నాన్న, పెద్ద నాన్న అంటూ ఆత్మీయ పకరింపులతో, సేవలందిస్తూ.. ప్రజల హృదయాలను చొరగొన్నారన్నారు. ఈ వాలంటీర్ వ్యవస్థ కొనసాగాలంటే సీఎం జగన్మోహన్ రెడ్డి ని తిరిగి గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. అభివృద్ధికి, చైతన్యానికి చిరునామాగా వాలంటీర్ వ్యవస్థ నిలుస్తోందన్నారు తుడా వీసీ వెంకట నారాయణ పేర్కొన్నారు. మీ సేవలు స్ఫూర్తిదాయకం  అని డీఎల్ డీవో సుశీలాదేవీ అన్నారు. వ్యక్తిత్వ వికాస నిపుణులు చిరంజీవి తనదైన శైలిలో ప్రసంగించారు. స్ఫూర్తిదాయక కథలు వివరిస్తూ.. వాలంటీర్లలో చైతన్యం తెచ్చారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మార్గదర్శకులు, గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్న నాయకులుగా అభివర్ణించారు. సమాజాన్ని చదువుతున్న అపర మేధావులు వాలంటీర్లు అని ప్రశంసించారు. ఏడు రకాల మాంసాహార వంటలతో ఏర్పాటు చేసిన నాన్ వెజ్ విందును వాలంటీర్లు ఆస్వాదించారు.

ఈ కార్యక్రమంలో చంద్రగిరి ఎంపీపీ హేమేంద్ర కుమార్ రెడ్డి, సింగిల్ విండో ఛైర్మెన్ చంద్రమౌళీశ్వర రెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article