వీరవాసరం
వీరవాసరం మండలం తోలేరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి ఆలయ వద్ద శనివారం శ్రీ సుబ్రహ్మణ్య షష్టి సందర్భంగా భారీ అనుసమారాధన నిర్వహించారు. ఈ అన్న సమారాధన కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాసరావు, జడ్పీటీసీ మాజీ సభ్యులు పోలిశెట్టి సత్యనారాయణ, వైసిపి నాయకురాలు గూడూరు ఉమా బాల ప్రారంభించారు. సుమారు 20వేల మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వహణ జవాబులు సత్యనారాయణ, రైస్ మిల్లర్ మల్ల రాంబాబు, ప్రభువు సామాజికవేత్త చెరుకువాడ రంగసాయి . తదితరులు పాల్గొన్నారు.
