ఆ కార్పొరేటర్లే కొంపముంచనున్నారా
మల్లాది కి చేసినట్లే వెలంపల్లి కి చేస్తారా
వారి అవినీతి అక్రమాలే శాపంగా మారనున్నాయా
మల్లాది ని ముంచిన వారే వెలంపల్లి ప్రక్కన చేరారా
అక్కడ దాచింది ఇక్కడ దోచిపెట్టక తప్పదా
సెంట్రల్ సీటు ఆశించిన ఆ రెడ్డే సీటు కింద నీరు తెస్తాడా
జగన్ ముద్దు.. వెలంపల్లి వద్దా..
బోండాకు దారి సుగమం అయినట్లేనా
మల్లాది మౌనం మంచిదేనా…
ఇదేమి కొత్త రాజకీయమో…
అమరావతి:ఎన్నికలు సమీపించాయి..కేవలం 33 రోజుల్లో ఎవరి భవితవ్యం ఏమిటన్నది తేలనున్నది. నేతల తలరాతలు ఈవీఎం లలో నిక్షిప్తమై ఉండబోతున్నాయి.అయితే ఇక్కడ చిన్న చిన్న ట్విస్ట్లు నేతల రాతలను మార్చనున్నాయి.రాష్ట్రంలో ఎంతో ఉత్కంఠగా ఉన్న స్థానాల్లో విజయవాడ సెంట్రల్ సీటు ఒక్కటని చెప్పాల్సిందే.సాధారణంగా ఇప్పటి వరకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన వారు తరువాత ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీ సమావేశాలకు హాజరైన సందర్భాలు లేవు.ఈ లోకొత్తర ధర్మం కూడా ఒకటి ఉంది. వెలంపల్లి శ్రీనివాసరావు గత ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొంది దేవాదాయ శాఖ మంత్రిగా కొనసాగారు. మంత్రిగా ఉండి విజయవాడ మేయర్ స్థానం లో తన వర్గానికి చెందిన రాయన భాగ్యలక్ష్మి ని కూర్చోబెట్టుకోగలిగాడు. బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో కొబ్బరి చిప్పల్లో కుడా వాటా ఉందనే ఆరోపణలతో కూడా అప్పట్లో వినిపించాయి. ఉపముఖ్యమంత్రి (దేవాదాయ శాఖ) ఉన్నక్ కొట్టు సత్యనారాయణను సైతం లెక్కచేయకుండా దుర్గగుడి వ్యవహారంలో వెలంపల్లి దే హవా నడిచిందన్న గుసగుసలు కూడా వినిపించాయి.ఇవన్నీ లెక్క చేయని వెలంపల్లి విజయవాడ పశ్చిమ సీటు దక్కుతుందని ఆశించి భంగపడ్డారు. చివరికి సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది కి ఎసరు పెట్టి తన అభ్యర్థిత్వం ఖరారు చేయించుకున్నాడు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గతన పరిధిలో ఉన్న కార్పొరేటర్ లను నిర్లక్ష్యం చేసి నగరంలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై నేరుగా వసూళ్లు పర్వం చేయటం తో చేశారని అందుకు ఆగ్రహించిన కార్పొరేటర్ లు అధిష్టానానికి పిర్యాదు చేసి మల్లాది అభ్యరిత్వా న్ని వ్యతిరేకించినట్లు విమర్శలు వెల్లువెత్తాయి. ఇది గ్రహించిన మల్లాది తన నియోజకవర్గ పరిధిలో ఉన్న కార్పొరేటర్ల ఆత్మీయ సమావేశంలో కొంత సర్దుబాటు చేసే ప్రయత్నం చేసిన ఫలితం లేకపోయిందన్న ఊహాగానాలు కూడా అప్పట్లో వినిపించాయి. ఇదే అవకాశం గా భావించిన వెలంపల్లి పశ్చిమ నియోజకవర్గ పరిధిలో కూడా బెట్టుకున్న సొమ్మును సెంట్రల్ నియోజకవర్గ ములో ధారాళంగా ఖర్చు చేస్తున్నాడన్న వదంతులు కూడా ఉన్నాయి. విజయవాడ సెంట్రల్ సీటు ఓసీ నే కాబట్టి తన సతీమణి కి లేదా తనకు ఎమ్మెల్యే సీటు కేటాయింపు చేయాలని తీవ్ర ప్రయత్నాలు చేసి విఫలం చెందిన ఓ రెడ్డి ఇప్పుడు వెలంపల్లి ప్రక్కనే ఉన్నాడట. అతను వైసీపీ అధినేత మీద ఉన్న అభిమానాన్ని కాదనే లేక ఇటు ఎమ్మెల్యే అభ్యరిత్వా న్నీ జీర్ణించుకోలేక వెలంపల్లి ని ఓడించాలా లేక గెలిపించాల అన్న సందిగ్దములో ఉంటూనే పక్క లో బల్లెం లాగా తయారవుతున్నాడన్న అనుమానాలు రేకెత్తు న్నాయని పార్టీ వర్గాల ద్వారా వ్యక్తమవుతోంది. ఎందుకంటే బెజవాడ కార్పొరేషన్ లో అవినీతి ఎక్కువగా అయ్యి ప్రతి అక్రమ బిల్డింగ్ లో ఈ నేత లక్షలు దండుకొంటూ ఇతను టీ కొట్టు వాడు, ఇతను పనిచేసుకునే వాడు అంటూ చుట్టూ కొంతమంది అల్లరిమూకలను వెంటబెట్టుకుని ప్రశ్నిస్తే దాడులు కు కూడా వెనుకాడక పోవడంతో ఆ ప్రాంతాల్లో తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉన్నట్లు సమాచారం.అవినీతి చేసిన వారు పేద అయిన ధనిక అయిన సరే తప్పు తప్పే కదా అన్న సహజ న్యాయాన్ని మరిచి దాడులకు దిగడం,దాడులు ప్రోత్సహించి ఆ దాడుల వెనుక ఉండి నాటకీయ పరిణామాలు చేయడంచూసిన ప్రజలు తమ ఓటు అనే ఆయుధం తో బుద్ధి చెప్పాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తొంది.అంతిమంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆశయ సాధనలో ఇలాంటి నేతలు తమ స్వార్ధ ప్రయోజనం ఎక్కువ ఉందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.కావున మాజీ మంత్రి వెలంపల్లి ఇక మాజీగా ఉండి పోక తప్పదన్న అనుమానం రేకిస్తున్నారు ఆయన ప్రక్కనే ఉన్న నేతలు మరి వెలంపల్లి భవితవ్యం ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.