Thursday, November 28, 2024

Creating liberating content

తాజా వార్తలువేలేరుపడులో బందు సంపూర్ణం ప్రశాంతం!

వేలేరుపడులో బందు సంపూర్ణం ప్రశాంతం!

వేలేరుపాడు,

దేశవ్యాప్తంగా కార్మికులు, కర్షకులు, రైతాంగ వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా చేపట్టిన గ్రామీణ భారత్ బంద్ వేలేరుపాడు మండలంలో విజయవంతం అయింది. వేలేరుపాడు మండల ఉన్న సిపిఐ,సిపిఎం కాంగ్రెస్, సిపిఐ ఎంఎల్ ప్రజాపంధ,ఆదివాసీ గిరిజన సంఘం గాలు
ఏవీఎస్పి ,, ఏఐఎస్ఎఫ్, రైతు కూలి, వ్యవసాయ కార్మిక, ఆటో, ఆశా, అంగన్వాడీ, మిడ్డే మీల్స్ ప్రజా సంఘాలు సంయుక్తంగా బంద్ లో పాల్గొన్నారు. ముందుగా మేడేపల్లి నుండి వేలేరుపాడు వరకు బైక్ ప్రదర్శన చేపట్టారు. అనంతరం అంబేద్కర్ కూడలి వద్ద నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలను రద్దుచేసి, నాలుగు లేబర్ కోడ్ గా కుదించి, కార్మికులు ప్రశ్నించే హక్కు లేకుండా సమ్మెలు చేసే హక్కు, ధర్నాలు చేసే హక్కు లేకుండా యూనియన్లను ఇబ్బందులు పెట్టే పద్ధతులను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని,కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని,కనీస వేతనం 26,000 అమలు చేయాలని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని, కడప ఉక్కు నిర్మించాలని ,కార్మికులకు పని భద్రత కల్పించాలని, పోలవరం ప్రాజెక్ట్ కు నిధులు మంజూరు చేసి నిర్వాసితులకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.మండలంలో ఉన్న స్కూల్స్,ప్రభుత్వ ఆఫీసులు, దుకాణ సముదాయాలు స్వచ్ఛందంగా మూసేసి బందుకు సహకరించారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం లో సిపిఎం మండల కార్యదర్శి ధర్ముల, రమేష్ సీఐటీయూ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మడివి, దుర్గారావు జిల్లా కౌన్సిల్ సభ్యులు పిట్టా, ప్రసాద్ రైతు సమాఖ్య జిల్లా అధ్యక్షులు సన్నెపల్లి సాయిబాబు, అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి సిరికొండ రామారావు, అఖిలభారత ప్రగతిశీల రైతు సంఘం ఏలూరు జిల్లా అధ్యక్షులు గడ్డాల ముత్యాలరావు, ప్రజా పంధా మండల కార్యదర్శి సోయం చందరావు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, కొల్లూరి సత్తిపండు, జిల్లా నాయకులు, వలగాని,సమ్మయ్య,ఆదివాసీ గిరిజన సంఘం మండల కార్యదర్శి, మడకం ఏసుబాబు, ముత్యాలరావు,గిరిజన సంక్షేమ పరిషత్ నాయకులు పైదా రమేష్, జిల్లా నాయకులు ఎర్ర మధు, కురిమెళ్ల శ్రీను, కన్నం నర్సమ్మ, మాసి లక్ష్మి, శైలజ, కృష్ణ వేణి,కుంజా నవీన్ తదితరులు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article