Friday, November 29, 2024

Creating liberating content

తాజా వార్తలుసచ్చిదానందమూర్తి ప్రాచీన భారతీయ తత్వవేత్త : వెంక‌య్య నాయుడు

సచ్చిదానందమూర్తి ప్రాచీన భారతీయ తత్వవేత్త : వెంక‌య్య నాయుడు

సెంటర్ ఫర్ స్టడీస్ ఇన్ ఆప్రో ఏషియన్ ఫిలాసఫీ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ సదస్సును మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సోమవారం ప్రారంభించారు. ఈ సదస్సు “విజన్ ఆన్ ఫిలాసఫీ ఆఫ్ ఎడ్యుకేషన్: రిఫ్లెక్షన్స్ ఆన్ 21వ శతాబ్దం ఎడ్యుకేషనల్ పాలసీ అండ్ ప్లానింగ్ ఇన్ ఇండియా” అనే అంశంపై నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఆయన ప్రొఫెసర్ కొత్త సచ్చిదానందమూర్తి విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.తదుపరి ప్రసంగంలో వెంకయ్య నాయుడు, సచ్చిదానందమూర్తి ప్రాచీన భారతీయ తత్వవేత్తగా గొప్ప కీర్తిని సొంతం చేసుకున్నారని, నేటి యువత ఆచార్యను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్, యుపిఎస్సి మాజీ సభ్యులు ఆచార్య కేఎస్.చలం, ఢిల్లీ విశ్వవిద్యాలయం ఫిలాసఫీ విభాగం విశ్రాంత ఆచార్యులు ఆచార్య అశోక్ ఓహరా, ఏఎన్యూ తాత్కాలిక ఉపకులపతి ఆచార్య గంగాధరరావు, రెక్టర్ ఆచార్య కే.రత్న షీలామణి, రిజిస్టార్ ఆచార్య జి.సింహాచలం తదితరులు పాల్గొని సచ్చిదానందమూర్తి సేవలను ప్రశంసించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article