ఆవిర్భావం..01.06.1979
💐💐💐💐💐💐💐
రాజులున్నా
రాజ్యాలు పోయి..
ఆధునిక చక్రవర్తుల ఏలుబడి..
బడాబాబులు..
స్వాహాస్వాముల జమానా..
ఇంకెక్కడ విలువలకు ఠికానా..
భూముల విలువే నజరానా..
దొరికిన చోటల్లా పాతేయడమే జెండా..
అదే నేతల అజెండా..
సుత..జామాత..
బొమ్మలే నిండా..
దర్జాగా కబ్జాలు చేసారనా..
ఎవరి జిల్లా..
ఇపుడెవరి ఖిల్లా..!
ఘనచరితకు సమాధి..
తమ వైభోగానికి పునాది..
నాటి మహరాజులేమో పాడుబడిన బంగళాల్లో..
నేటి నేతలు పంచనక్షత్రాల
హోటళ్ళను పోలిన ఇళ్లలో..
జిల్లా అథోగతి..
నేతల ఉన్నతే
సాధించిన ప్రగతి..!
ఊరంతా ఫౌంటెన్లు..
రోడ్లన్నీ గుంటలు..
అదేనట అభివృద్ధి..
నేతల స్వయంసమృద్ధి..
పరిశ్రమలకు తాళాలు..
శ్రమమాటేలేని నాయకులకు
మేళతాళాలు..
అన్న జిందాబాదంటూ
పెయిడ్ ఆర్టిస్టుల పక్కతాళాలు..
ప్రారంభోత్సవాల పేరిట
రోజూ కుంభమేళాలు..!
అదే అదే మా ప్రగతి..
అదే అదే మా సంస్కృతి..!!
నా కళ్ళెదుట కట్టిన కలెక్టరేట్..
ఎక్కడికక్కడే పగుళ్లు..
ఎప్పటికప్పుడు
పైపై హంగులు…
ఫ్లోరింగ్ సోకులు..
కార్పొరేట్ లుక్కు..
ఎక్కడికక్కడ తుక్కుతుక్కు!
కోర్టు భవనాలు
కట్టడమూ తెలుసు..
అక్కడిప్పుడు ఖాళీ జాగా..
అంతలోనే ఆ భవనానికి కాలం చెల్లి..
కొత్త సముదాయానికి
రాయి పడేలోగా
అదెంత లొల్లి..!
నా జిల్లా ఇప్పుడు
భూఆక్రమణల బలిపీఠం..
దుర్మార్గులకు అధికారపీఠం..
నేర్పారు గుణపాఠం..
2019 టు 2024..
ఎ జర్నీ టు బాటం..
చూపిస్తూ చేతివాటం..!
1979 లో పుట్టింది..
ఎక్కడ వేసిన గొంగళి
అక్కడే ఉంది..
అభివృద్ధిలో జిల్లా మందగమనం..
కోట్లకు పడగలెత్తిన
నయా నేతలు..
జిల్లా చిత్రపటంపై
తిరోగమన వాతలు..!
ఈఎస్కే..