Monday, January 13, 2025

Creating liberating content

తాజా వార్తలుకొండ రెడ్ల గిరిజన యువతకు క్రికెట్, వాలీబాల్ కిట్లను పంపిణి చేసిన ఎమ్మెల్యే

కొండ రెడ్ల గిరిజన యువతకు క్రికెట్, వాలీబాల్ కిట్లను పంపిణి చేసిన ఎమ్మెల్యే

వి.ఆర్.పురం :మండలంలోని తుమ్మిలేరు గ్రామపంచాయతీ పరిధిలోని గిరిజన ప్రాంతాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యమానికి వచ్చిన ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి, ఈ సందర్భంగా కొల్లూరు,తుమ్మిలేరు గ్రామాల యువకులకు క్రికెట్, వాలీబాల్ కిట్ల ను ఆమే చేతులమీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, యువకులు చెడు మార్గంలో వెళ్లకుండా, చదువు పట్ల ఆటల పట్ల మక్కువ చూపి, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, దానికి నా వంతుగా ప్రభుత్వం నుంచి రావాల్సిన సౌకర్యాలు మీకు అందిస్థానని ఆమె తెలిపారు. అనంతరం కొల్లూరు, గొందురు, కొండేపూడి, తుమ్మిలేరు గ్రామస్థులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా స్థానిక కొండ రెడ్లతో మాట్లాడుతూ, ఈ నాలుగు సంవత్సరాలు కాలం లో వైసిపి జగన్ ప్రభుత్వం నుంచి అందిన సంక్షేమ పథకాలు, లబ్ది గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, మండల అధ్యక్షుడు మాదిరెడ్డి సత్తిబాబు, రాష్ట్ర నాయకులు మాచర్ల గంగయ్య, జే సీ ఎస్ మండల ఇంఛార్జ్ బొడ్డు సత్యనారాయణ, మాజీ మండల కన్వీనర్ పోడియం గోపాలరావు, ఎస్సీ ఎస్టీ విజిల్స్ అండ్ కమిషన్ సభ్యులు చిక్కాల బాలు, మండల నాయకులు కాపారపు ఉమామహేశ్వరరావు, ముత్యాల గౌతమ్, ఆరవ సూర్యప్రకాస్, జీడిగుప్ప సర్పంచ్ ముట్ల బాలరాజు, చీమల కాంతారావు, మోడెమ్ నరేష్, ముత్యాల శ్రీధర్, స్థానిక కార్యకర్తలు అందేలా రమణారెడ్డి, సూత్రు లచిరెడ్డి, మాధవరెడ్డి, రేఖపల్లి ఎస్సీ కాలనీ యూత్, ముత్యాల శ్రీధర్, కమ్మ చిచ్చు వెంకటేశ్వర్లు, స్థానిక కార్యకర్తలు సుత్రు మోహన్ రెడ్డి, సచివాలయ కన్వీనర్లు, గృహసారదులు, సచివాలయ సిబ్బంది, వలాంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article