బట్టలు ఉతకడానికి చాలా మంది వాషింగ్ మిషన్ వాడతారు. దీని వల్ల చాలా టైమ్ సేవ్ అవుతుంది. బట్టల్ని చక్కగా ఉతికేసే వాషింగ్ మెషిన్‌ని మరి నెలకోసారైనా క్లీన్ చేయాలిగా. అలా టాప్ లోడ్ వాషింగ్ మెషిన్‌ని ఎలా క్లీన్ చేయాలో తెలుసుకోండి. క్లీనింగ్‌కి కావాల్సిన పదార్థాలు..సాఫ్ట్ క్లాత్పాత టూత్ బ్రష్ లేదా డిష్ స్క్రబర్డిస్టిల్డ్ వైట్ వెనిగర్డిష్ స్క్రబ్బింగ్ లిక్విడ్. ముందుగా వాషర్ డ్రమ్‌ని ఖాళీ చేయండి. క్లీనింగ్ లిక్విడ్ ట్రేస్ కూడా ఖాళీ చేయాలి.వాషింగ్ మెషిన్‌లోకి వచ్చే నీటి గురించి సెటింగ్స్ ఉంటాయి. కొన్ని లేటెస్ట్ టెక్నాలజీలో హాట్ వాటర్ ఆప్షన్ కూడా ఉంటుంది. మీ మెషిన్‌లో ఆ ఆప్షన్ ఉంటే హై హార్ట్ వాటర్, ప్రెజర్‌ది సెట్ చేయండి. దీనివల్ల వాటర్ మెషిన్ చక్కగా క్లీన్ అవుతుంది. అదే విధంగా, ఎంచుకున్న సెట్టింగ్స్ ప్రకారం.. మెషిన్‌ని ఆన్ చేయండి. వాషర్ డ్రమ్‌ని నీటితో నింపండి. నీరు నిండేవరకూ ఉండండి. తర్వాత డ్రమ్‌లో నాలుగు కప్పుల డిస్టిల్డ్ వైట్ వెనిగర్ లేదా క్లోరిన్ బ్లీచ్ వేయాలి. ఒకటి మాత్రమే వేయాలి. ఎందుకంటే ఎక్కువ కెమికల్స్ కలిస్తే ప్రమాదకరమైన క్లోరిన్ ఏర్పడుతుంది. కాబట్టి, జాగ్రత్త.ఇప్పుడు వాషింగ్ మెషిన్ క్లీన్ చేయండి. ఎక్కువ టైమ్ సెట్ చేసి ాన్ చేయండి. ఎక్కువ సేపు తిరిగితే డ్రమ్ లోపల మురికి బయటకు వస్తుంది. వాషింగ్ సైకిల్ పూర్తయ్యాక డ్రమ్‌లోని నీటిని తీసేయండి.. దీనిని మరోసారి క్లీన్ చేస్తే మొత్తం క్లోరిన్ లేదా వెనిగర్ బయటికి వెళ్తుంది. దీంతో పాటు..మెషిన్‌లో ఇన్‌స్టాల్ చేసిన డిటర్జెంట్ డిస్పెన్సర్స్‌ని ఈజీగా బయటికి తీసేసేవి అయితే.. ఓ బకెట్ గోరువెచ్చని నీటిలో ఓ కప్పు డిస్టిల్డ్ వైట్ వెనిగర్‌తో కలిపి 15 నిమిషాలు ఉంచండి. డిస్పెన్సర్స్ తీయరాకపోతే అదే వేడి వెనిగర్ నీటిని వాటిలో పోసి నానబెట్టి తర్వాత అందులో అంటుకున్న మరకల్ని క్లీన్ చేసేందుకు బ్రష్ వాడండి. మరోసారి వెనిగర్ కలిపిన గోరువెచ్చని నీటితో వాషింగ్ మెషిన్ రన్ చేయండి. దీంతో మురికి మొత్తం వచ్చేస్తుంది