పోలవరం శాసనసభ్యులు – బాలరాజు
కొయ్యలగూడెం

రెవిన్యూ సమస్యలను సత్వరం పరిష్కారం కోసం నెల రోజులు పాటు రెవెన్యూ సదస్సు నిర్వహిస్తున్నట్లు పోలవరం శాసనసభ్యులు బాలరాజు అన్నారు.
కొయ్యలగూడెం మండలం కన్నాపురం గ్రామంలో సచివాలయం నందు ఏర్పాటు చేసినటువంటి మీ భూమి – మీ హక్కురెవెన్యూ సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు , ఆర్డీవో రమణ.
ఈ కార్యక్రమంలో మీ అభివృద్ధి కోసం మీ సంక్షేమ కోసం మీ రక్షణ కోసం కూటమి ప్రభుత్వం శ్రమిస్తోందని తెలియజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రెండో సంతకంతో ల్యాండ్ టైటిల్ రద్దు చేయడం జరిగింది అని ఆయన అన్నారు.
అనంతరం ప్రజల వద్ద నుండి అర్జీలు స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో కొయ్యలగూడెం మండల అధ్యక్షులు తోట రవి ,పారేపల్లి నరేష్ , పట్టణ అధ్యక్షులు మాదేపల్లి శ్రీనివాస్ ,జేష్ఠ రామకృష్ణ , బీజేపీ నిర్మల కిషోర్ , మండల ఉపాధ్యక్షులు అల్లం సత్తిరాజు ,గ్రామ ప్రెసిడెంట్ రాఘవ ,బొమ్మ గంటలయ్య ,జడ్పిటిసి ఎంపిటిసి సర్పంచ్ మరియు రెవిన్యూ శాఖ సిబ్బంది, నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.