వంట చేసేందుకు నేడు చాలా మంది వంట గ్యాస్ వాడతారు. దీనిని వాడేటప్పుడు కొన్ని విషయాలు కచ్చితంగా గుర్తుంచుకోవాలి. కొత్త కనెక్షన్ నుంచి సీజన్స్ మారే టైమ్ వరకూ దానిని ఎలా వాడాలో తెలిసి ఉండాలి. దీని వల్ల సరిగ్గా వాడుకోవచ్చు. అవేంటో తెలుసుకోవాలి.
సిలిండర్ మార్చేటప్పుడు..
సిలిండర్ మీరు సరైన డీలర్ నుంచి తీసుకున్నారని గుర్తుంచుకోండి.సిలిండర్ డెలివరీ అయినప్పుడు కంపెనీ సీల్, సిలిండర్ సరిగ్గా సీల్ చేశారో లేదోనని గుర్తుంచుకోవాలి.సీల్ చిరిగిపోతే దానిని వాడొద్దు.సిలిండర్ లోపల డేట్‌ని చూడాలి.A అంటే జనవరి నుంచి మార్చి వరకూ అని B అంటే ఏప్రిల్ నుంచి జూన్ వరకూ అని C జులై నుండి సెప్టెంబర్ వరకూ అని D అక్టోబర్ నుండి డిసెబర్ వరకూ అని అర్థం.ఉదాహారణకి DFT-A-24 తేదీ ఉంటే అది మార్చి వరకూ వాడొచ్చు అని అర్థం. డేట్ ఎక్స్‌పైర్ అయితే ఆ సిలిండర్ వాడొద్దు.వాడే ముందు సోప్ వాటర్ పూస్తే గ్యాస్ లీకేజి గురించి తెలుసుకోవచ్చు.
అదే విధంగా, గ్యాస్‌పై వంట చేసేటప్పుడు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. మంచి వెంటిలేషన్ ఉండాలి.తలుపు, కిటికీలు దెరిచి ఉంచాలి,మండే పదార్థాలు దగ్గర ఉండొద్దు.బట్టలు కూడా జాగ్రత్తగా వేసుకోవాలి.సిలిండర్ వాడనప్పుడు రెగ్యులేటర్ ఆఫ్ చేయాలి.గాలి వచ్చే చోట సిలిండర్స్‌ని పెట్టాలి.సిలిండర్‌ని ఎప్పుడు కూడా పడుకోబెట్టొద్దు. నిలబెట్టాలి.సంవత్సారినికి ఓ సారి రెగ్యులేటర్, ట్యూబ్‌ని మార్చాలి.ISI సర్టిఫైడ్‌వి మాత్రమే వాడాలి.సురక్షితమైన పరికరాలను వాడాలి.సిలిండర్‌కి హాని కలిగించే పనులు చేయొద్దు.
ప్రమాదం జరిగినప్పుడు..రెగ్యులేటర్ బర్నర్స్ నాబ్స్ మూసివేయండి.వెంటిలేషన్ కోసం తలుపులు, కిటికీలు తెలరవండి.లైట్స్, మంటకి కారణమయ్యే వాటిని దూరమవ్వండి. లైట్స్, కరెంట్ స్విచెస్ ఆఫ్ చేయాలి.కరెంట్‌ని డిస్‌కనెక్ట్ చేయండి.మంటకి కారణమయ్యే వాటిని దూరం పెట్టండి.