జనసైనికులకు జగడాలు జరుగుతున్నాయనా..
ఉపముఖ్యమంత్రి కంటే కంటే హోమ్ మంత్రికి పవరెక్కువ..
పవన్ కళ్యాణ్ ఆవేదన లో అర్థ మేమిటో..
కూటమిలోనే వేరు కుంపట్లు ఉన్నాయా…
పోలీసుల నిర్లక్ష్యం కూటమికి కలిసిరాలేదా..
ప్రభుత్వం మారినా పని తీరు మారలేదా..
స్వపక్ష్యం లోనే విపక్ష్యం ఉందా..
ప్రతి పక్ష పార్టీకి వీరే లీకులు ఇస్తున్నారా..
మూడు పార్టీల మధ్య ముచ్చట్లు ఉన్నాయా..
ఆదిలోనే హంసపాదమైతే ..
భవిష్యత్ లో ఇంకెన్ని చూడాలో …
(రామమోహన్ రెడ్డి,సంపాదకులు)
ఆరుగాలం శ్రమించారు…అనుకున్నది సాధించుకున్నారు..అంతులేని ప్రజాభిమానం చూరగొని ఐదేళ్లు అధికారం అనుభవించిన వారికి అడ్రెస్ గల్లంతు అయ్యేలా కార్యాచరణ చేసి కార్య సిద్దులై గొప్ప కార్యక్రమాలు చేపడుతున్నారు. కూటమి గా ఏర్పడి కార్యకర్తలలో ఆత్మస్థైర్యాన్ని నింపారు.కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతిపక్ష పార్టీకి కుశాలు కదిలించి వేస్తారు అనుకుంటే ఉపముఖ్యమంత్రి గా ఉండి హోమ్ మంత్రి పనితీరుపై బహిరంగంగా విమర్శ లు చేసే స్థాయికి పరిస్థితి వచ్చిందంటే పరిపాలన యంత్రాంగ ఎలా ఉంది అన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్న . రాష్ట్రంలో రోజు రోజుకు మహిళల మీద నేరాలు జరుగుతున్నాయి.బైటికి వచ్చేవి కొన్ని మాత్రమే సమాజానికి తెలియకుండా బైటి ప్రపంచానికి కానరాకుండా ఎన్నో దుస్సంఘటన లు జరుగుతున్నాయి.అయితే ఈ నేరాలు జరగడం ఇప్పుడేమి కొత్త కాకపోయినా ఇటీవల కాలంలో అవి కాస్త పరాకాష్ట కు చేరుకుంటున్నాయి.రంగం ఏదైనా మహిళ ల పట్ల జరుగుతున్న నెరమయ సంఘటన లు సమాజాన్ని బాదిస్తున్నాయి.అందుకు గల కారణాలు అనేకం కావచ్చు కానీ సమాజ హితం కానీ విదంగా జరగడమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మనస్సును గాయపరిచినట్లు ఉంది.అందుకే ఆయన బహిరంగంగా కూటమి ప్రభుత్వం లో భాగమైనప్పటికి తమ ప్రభుత్వ పనితీరుపై కూడా ప్రత్యక్షంగా హెచ్చరికలు జరీచేసారన్నది ఇప్పుడు రాజకేయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడ అసకు సమస్య పోలీసులు పాత్ర.సమాజంలో ప్రతి సంఘటన కు పోలీసులు కీలకంగా వ్యవహరించాల్సిన నైతికత ఉంటుంది.అంటే వారి ప్రమేయం తో జరుగుతున్నాయా అంటే అవునని అనలేని కాదని చెప్పలేని పరిస్థితి. ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ అధికార వ్యవస్థ అనేది చాలా కీలకమైనది.ప్రభుత్వాలు మారినా ఆ ప్రభుత్వము లో ఉన్న పెద్దలు తమ పరిపాలన కాలంలో చేసిన మంచి చెడులు బీరీజు వేసుకుంటారు. అయితే ఇక్కడ జనసేనాని వ్యక్తిగత జీవితం ప్రక్కన బెడితే రాజకీయ జీవితాన్ని చాలా మార్పు దిశగా అడుగులు వేస్తున్నారు.ఈ నేపధ్యంలో కూటమి గా ఏర్పడటం ప్రభుత్వం ఏర్పాటు చేయడం లో కీలకం గా వ్యవహరించారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను ఆదర్శంగా తీసుకుని పాలన సాగిస్తుంటే నాయకుల మధ్య కొరబడిన సఖ్యత కార్యకర్తల మధ్య సమన్వయం లోపించడం లాంటివి నీవురుగప్పిన నిప్పులా ఉన్నాయనేది ఆయా పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే గత ఎన్నికల ముందు నుంచి కూడా జనసేనాని మహిళా సంరక్షణ ఆడపిల్లల అఘాయిత్యాలపై అనేక మార్లు పోలీసుల తీరుపై దుమ్మెత్తి పోశారు. అయితే ఇపుడు ఉన్నది తాము అయినప్పటికీ ఇంకా పోలీసులు తీరు మారలేదని ఇలాంటి బహిరంగ విమర్శలు రావడం చూస్తే ఇంతకీ పోలీసులు కూటమి ప్రభుత్వములో ఉన్నారా లేక ఇంకేదయిన అనుకుంటున్నారా అన్నది అర్థం కానీ పరిస్థితి దాపురించింది. మరి ఉపముఖ్యమంత్రి స్వయంగా నే విమర్శలు చేయడం విపక్ష పార్టీలకు బ్రహ్మాస్త్రం ఇచ్చినట్లు కాదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చూడాలి మరి భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుందనేది.