ఏది చిన్నది …ఏది పెద్దది…
నాడు నార్ల చెప్పింది నాటకమా లేక మీ…?
పత్రికల్లో తేడాలెందుకు…
8 సభ్యులుండి 8 జిల్లాల్లో కమిటీలు తీసుకుంటే నే గొప్పవారా
పరాయి రాష్ట్రంలో ఉండి ఇక్కడ పెత్తనాలా..
ఇక్కడ సంపాదకులకు చావా సచ్చిందా…
ఎంఫ్యానల్మెంట్ ఉంటే ఏదయినా చేయొచ్చా..
మీ సంఘాలు మీ సంచి నింపుకోవడానికా కాదా..
ఎంఫ్యాన్ల్మెంట్ లోనే ఎన్ని సంఘాలో మరి…
మీకు కూడా ఏకాభిప్రాయం లేదా…
సమాచార శాఖలో మీదే పెత్తనమా..
మీరు చెప్పిందే వినాలా లేకుంటే అన్నికిటి అడ్డంకులే నా
మీ చిత్తశుద్ది ఆచరణలో ఉందా లేదా..
ముష్టి పనులు చేస్తూ మళ్లీ మాయమాటలెలా
ఎవరికి చెప్పేది మీ శ్రీరంగనీతులు …
చెప్పేది ఒకటి చేసేది ఇంకొకటా..
ముష్టియుద్దాలపై ముఖ్యమంత్రి కార్యాలయం ఆరా..
అబ్బే అంటున్న ఉన్నతాధికారులు..
మీరేమి సంపాదకులంటూ ఛీత్కారాలు..
ఎవరి స్వలాభం కోసం ఈ సంఘాలని మండిపాటు..
ఇదేమి పత్రికా వ్యవస్థ అంటూ అధికారుల ఆశ్చర్యం..
అక్రిడేషన్ కమిటీలో అక్రమాలకు అడ్డుకట్టకు ఆలోచనలు…
ఏమిటా గందరగోళం… ఎవరు దీనికి కారణం..
(రామమోహన్ రెడ్డి, సంపాదకులు)
పత్రికొక్కటున్న పదివేల సైన్యము, పత్రికొక్కటున్న మిత్రకోటి, ప్రజలకు రక్ష లేదు పత్రిక లేనిచో… ” అని చెప్పిన పత్రికా సైన్యాధ్యక్షుడు నార్ల వెంకటేశ్వరరావు. పత్రికను పైకి తేవడానికి నార్ల అనేక కొత్త ఒరవడులు ప్రవేశపెట్టారు.ఎడిటరైనవాడు బిడియము చూపుచో ధాటి తగ్గు వృత్తి ధర్మమందు, కడుపుకూటి రాత కక్కుర్తి రాతరా’ అంటూ తోటి రచయితలనూ, భావి సంపాదకులనూ హెచ్చరించిన యోధుడు నార్ల. ముఖ్యంగా జర్నలిజం రంగంలోకి అడుగుపెట్టేవారు నిజాయతీగా, నిర్భీతిగా ఉండాలని కోరే మేటి పాత్రికేయుడు నార్ల. “నిజము కప్పిపుచ్చి నీతిని విడనాడి స్వామి సేవ సేయు జర్నలిస్టు తార్చువాని కంటే తక్కువ వాడురా” అని కుండ బద్దలుగొట్టినట్లు చెప్పడం నార్లవారికే చెల్లింది. “ఏ ఎండకు ఆ గొడుగు పట్ట నేర్చినవాడు ఏమైనా కావచ్చునేమో కానీ, నిజమైన ఎడిటర్ కానేకాడు.” అని నిష్కర్షగా చెప్పేవారు.కానీ నేడు అదే పత్రికా సంపాదకులమంటూ తమ సంచులు నింపుకోవడానికి రాష్ట్రంలో ఉన్న సంపాదకులను చిన్న చూపు చూసేలా చేస్తూ తమ స్వార్థం కోసం అందరిని సంక నాకించే ప్రయత్నం చేస్తున్నారు కొందరు సంఘాల నేతలు. ఏది కూడా సున్నా నుండి మొదలై ఒకటి నుండి ఒక్కొక్క మెట్టు ఎక్కుతారే తప్ప ఒక్క సారి అన్ని మెట్లు ఎక్కడం అసాధ్యం అన్న ఆలోచన లేకపోగా ఎదిగే వారిని అనగ ద్రోక్కాలని చూడటం ఎంతవరకు సమంజసమో అర్థం కావడం లేదు. .. ఒకనాడు పత్రికా గొప్పతనం పై నార్ల చాలా క్లుప్తంగా చెప్పారు.కానీ సంపాదకులే తోటి సంపాదకులను చిన్న చూపు చూస్తూ వారిది చిన్నది మాదే పెద్ద పత్రిక లంటూ పైగా ఎంఫ్యాన్ల్మెంట్ ఒక సంజీవిని లాగా చూపిస్తూ పొద్దుకు పది మార్లు సమాచార శాఖ అధికారులతో చెట్టాపట్టాల్ వేసుకుని ఊసుపోనీ కబుర్లు చెప్పుకుంటు చివరికి వారికే అన్ని సౌకర్యాలు ఉండేలా చూసుకోవడం ఎంత వరకు సమంజసమో అర్థం కావడం లేదు.ఓకే తమకు ఇష్టమొచ్చినట్లు చేసుకోవచ్చు దానిని ఎవరూ కాదనరు.నిబంధనలకు నీళ్లొదిలి పరాయి రాష్ట్రంలో ఉంటూ నిస్సిగ్గుగా ఇక్కడ పెత్తనాలు వెలగబెడుతు మళ్ళీ రంగ రంగ శ్రీరంగ అంటూ నీతులు చెబుతుంటే ఇక్కడి సంపాదకులు ఎవరి మూతులు నాకుతున్నారో మరి. ఇప్పటికే పతనమవుతున్న పత్రికా రంగంలో అనేక అవమానాలను ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికి ఉన్నది ఎంత ఎంత మంది అందులో ఎన్ని చీలికలు అయ్యాయి అనేది లేకుండా మాది ఎంఫ్యాన్ల్మెంట్ మాకు అన్ని కావాలి వారికి ఇవి ఇవ్వద్దు,వీరికి ఇవి ఇవ్వద్దు అని కుంటి సాకులు చెబుతూ పరాయి రాష్ట్రంలో ఉంటూ ఈ రాష్ట్రంలో ఉన్న పత్రికల మనుగడ ప్రశ్నర్ధకంగా చేయడానికి కుట్రలు చేయడం ఎంతవరకు సమంజసం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే జర్నలిస్టుల జీవితాలు సంక్షోభంలో ఉన్న నేపథ్యంలో జర్నలిస్టుల పేరుతో సంఘాలు దోపిడీ చేస్తుంటే తగుదునమ్మా అంటూ వీరి ముష్టివేసాలు మరీనూ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొన్ని సంస్కరణలతో ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు, యువ మంత్రి నారా లోకేష్ పత్రిక ల మనుగడ పై జర్నలిజం పట్ల క్షుణ్ణంగా అవగాహన కలిగిన సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి నేతృత్వంలో అన్ని సమస్యలపై సమగ్ర నివేదిక తీసుకుంటుంటే ఎక్కడ వీరి లోపభూయిష్టంగా ఉన్న విధానాలు బైట పడతాయని ఆ సంఘం వద్దు ఈ సంఘం వద్దు మేమే ముద్దు మాకిస్తే మొత్తం నాకేస్తాం అంటూ నాటకాలు ఆడుతుంటే నవ్విపోతుంది పత్రికా లోకం.సచ్చుబడిపోతుంది సంపాదక లోకం.ఏమి చర్యలు తీసుకోవాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు అధికార యంత్రాంగం. అయినా ఆగలేదు వీరి అఘాయిత్యాలు.అందుకే అబ్బే అంటుంది అత్యున్నత స్థాయి అధికారులు. అన్ని వివరాలు సేకరిస్తున్నారు అక్రిడేషన్ కమిటీలో అక్రమాలు జరగకుండా చూడలని.అందుకే అన్ని వినతి పత్రాలను వివరంగా చూస్తూ అన్ని విషయాలపై ఆలోచన లో పడి ఎక్కడ అన్యాయం జరుగుతుంది ఇదెక్కడి పత్రికా వ్యవస్థ అంటూ పైకి అనలేదుకాని లోన ఛీత్కరించుకుంటున్నారు చీఫ్ మినిష్టర్ కార్యాలయ వర్గాలు. దీనితో చిన్న బోతున్నాయి చిల్లర పనులకు అలవాటు పడి చిన్న పత్రికల సంపాదకులపై చిన్న చూపు చూసే వారికి.ఒట్టి కబుర్లు చెప్పి లోగుట్టు దాచుకున్న వారికి.అందుకే”నిగ్గ దీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్నిఅగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్నిమారదు లోకం మారదు కాలందేవుడు దిగి రాని యెవ్వరు యేమై పోనిమారదు లోకం మారదు కాలంగాలి వాటు గమనానికి కాలి బాట దేనికిగొర్రెదాటు మందకి మీ జ్ణానబోధ దేనికియే చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠంయే క్షణాన మార్చుకుంది జిత్తుల మార్గంరామబాణమార్పిందా రావణ కాష్ఠంకృష్ణ గీత ఆపిందా నిత్య కురుక్షేత్రంనిగ్గ దీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్నిఅగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్నిపాత రాతి గుహలు పాల రాతి గృహాలయినాఅడవి నీతి మారిందా ఎన్ని యుగాలయినావేట అదే వేటు అదే నాటి కధే అంతానట్టడవులు నడివీధికి నడిచొస్తే వింతాబలవంతులె బ్రతకాలని సూక్తి మరవకుండాశతాబ్ధాలు చదవలేదా ఈ అరణ్యకాండనిగ్గ దీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్నిఅగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని “అంటూ నిజమైన జర్నలిస్టుల సంఘాలు,పత్రికా సంపాదకులు సంఘాలు ఐక్య పోరాటానికి పిలుపునిస్తున్నాయి.ఈ ఐక్య కార్యాచరణతో ముఖ్యమంత్రి కి అన్ని విషయాలు సవివరంగా వివరించి పొరుగు రాష్ట్రాల పరాయి పెత్తనం,నవ్యాంధ్రప్రదేశ్ లో చిన్న, వార, మాస,దిన పత్రిక ల మనుగడ తో పాటు వ్యవస్థ లో ఉన్న లోపాలను వెలికి తీసి నేతల వెతలను కథలుగా క్లుప్తంగా తెలియపరిచి అటు పత్రిక ల ఇటు జర్నలిస్టుల సంక్షేమమే పరమావదిగా ముందుకు సాగడానికి అడుగుల పడుతున్నాయి.అప్పుడు తెలుస్తుంది…”ఔను నిజం, ఔను నిజంఔను నిజం, నీవన్నది,నీవన్నది, నీవన్నది,నీవన్నది నిజం, నిజం!లేదు సుఖం, లేదు సుఖం,లేదు సుఖం జగత్తులో!బ్రదుకు వృథా, చదువు వృథా,కవిత వృథా! వృథా, వృథా!మనమంతా బానిసలం,గానుగలం, పీనుగలం!వెనుక దగా, ముందు దగా,కుడి యెడమల దగా, దగా!బ్రతుకు ఛాయ, చదువు మాయ,కవిత కరక్కాయ సుమీ!లేదు సుఖం, లేదు రసం,చేదు విషం జీవఫలం!జీవఫలం చేదువిషం,చేదు విషం, చేదు విషం!ఔను నిజం, ఔను సుమా,ఔను నిజం నీవన్నది!నీవన్నది, నీవన్నది,నీవన్నది నిజం, నిజం!”అని సిరివెన్నెల మాటలు చక్కగా కనివిప్పు కలిగించి కలం కు సలామ్ అంటారు అందరూ..చూడాలి మరి ఈకుట్రలు కుతంత్రాలు కాలాన్ని ఎంత వరకు అనక ద్రోక్కే ప్రయత్నం చేస్తాయో