Thursday, November 28, 2024

Creating liberating content

సాహిత్యంఏది బంధం… ఎవరిది బంధం..

ఏది బంధం… ఎవరిది బంధం..

ఎవరికి…ఎవరు…ఎవరితో ఎవరు..
ఉన్నన్ని రోజులు ఉత్తుత్తి ప్రేమలు…ఊపిరి పోయాక …
ఉన్నది ఒకటే జీవితం ఎన్నెన్నో వ్యధలు..
మూన్నాళ్ల ముచ్చట లో మరుపురానివి ఎన్నో..
ఉన్నప్పుడు ఉండదు మానవత్వం…లేనప్పుడు చూపిన వ్యర్థమే కదా. .
ఉండేది ఎంతకాలం…ఈ కాస్తంతలో కొట్లాటలెన్నో..
తనువు ఉన్నప్పుడు మనసుండదు… మనసున్నప్పుడు తనువుండదు..
ఈ తన్నులాటల్లో తుదిశ్వాస పోతే…
ఈ పుట్టుక గిట్టుకుల మధ్య ఎన్నెన్ని పాట్లో…
కళారంగమా కన్నీళ్లు తెప్పించకే..
కళామ తల్లి కాస్త కరుణించవే..
స్వరాన్నిస్తావ్…భిన్న స్వరాలు వినిపిస్తావ్..
కంఠాన్ని ఇచ్చావ్…అప్పుడే కాటువేస్తావ్..
ఆ కంఠం కోసం ఎన్నేన్ని కీచులాటలో..
పావని పయనం .. ప్రతి ఒక్కరికి జ్ఞానోదయం ..

(కృష్ణ సింధు, (క్రైం)
“గుండెనెందుకిచ్చావురా, దేవుడా ఎండమావి చేశావురా, దేవుడా అమృతమంటి ప్రేమను కురిపిస్తావుమరు నిమిషంలో విషముగ మరిగిస్తావుమనసు మనసుతో ముడివేసి మౌన ప్రేమతో పెనవేసిఒకరికొకరుగా తోడును చేస్తావుఒకరికి ఒకరిలా చూస్తావుఆడినంతసేపాడుకొని బొమ్మలన్ని విసిరేస్తావుఊహ తెలియని పసిపాలపై బొమ్మరిల్లు తన్నేస్తావుఏ మాయ తెలియని పసి హృదయాలను తలో దిక్కుగా విసిరికొడతావుఎదను గుడిలాగ మార్చేసిఎదుట దేవతలను చూపించిప్రేమలే కురిపించేస్తావువింత మాయలో పడదోచేస్తావుబ్రతుకు హారతిగ వెలిగించి వెతల పాత్రలో కరిగించివెలుగు రేఖలను నిలువుగ కోస్తావువిలువ చీకటిగా మిగిలించేస్తావూనిండు ప్రాణాలు కదిలిపోతుంటె కంటి నీటితో కాల్చేవుబండరాయిగా నువ్వుంటావు కనుకనే బాధ పడలేవుఈ మాయలన్ని ఇక నీకే తెలుసని మనిషిని పట్టుకు వేధిస్తావుఎండమావి చేశావురా, దేవుడాఅమృతమంటి ప్రేమను కురిపిస్తావుమరు నిమిషంలో విషముగా మరిగిస్తావుగుండెనెందుకిచ్చావురా ఓ దేవుడా” ఈ పాట రాసిన మహనీయుడు ఏ క్షణాన తన అక్షరాలను లిఖించాడో ఆ అక్షరాల అర్థం చేసుకున్న మనుషులు మాత్రం వారి మనస్సులలో మరుపురాని అనుభూతిని నింపుకొంటారు. ప్రకృతి లో ప్రతిజీవి జననం మరణం కారణ జన్ముడి లీల ప్రకారం జరగాల్సినదే.కానీ మరణనమేది ఉన్నదని తెలిసి కూడా ఈ మాయా ప్రపంచంలో మనుస్యుల మధ్య ఏర్పడుతున్న వింత గాధలు చాలా అగాదాలు తెచ్చిపెడుతున్నాయి. అయితే అన్ని జన్మల్లో మానవ జన్మ చాలా ఉతృస్ట్కమైనదని పురాణాలు చెబుతున్నాయి. అంతటి ఉత్రుస్ట్కమైన జన్మలో మనవులుగా జన్మించిన మనము జంతువులు కంటే హీనంగా ఒక్కోసారి ప్రవర్తిస్తుంటే మనస్సు ఎంత గాయపడుతుందో ఏదైనా గాయపడ్డ మనస్సుకే తెలుస్తుంది. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాం అన్న తీరుగా మనుషులు వేరైనా మనస్సుతో ఆలోచనలు చేసి ఒకరి భావాలు ఒకరు పంచుకుని బంధం అనేది ఏర్పరడుతుంది. ఏ బంధమూ చిరకాలము ఉండదు ఉండాలన్న ఆ భగవంతుడు ఆడే విధి అనే నాటకంలో ఏదో ఒక రోజు విడిపోక తప్పదు. కానీ ఈ బంధాలు అనుబంధాలు అనేవి ఎంతవరకు అన్నది ఇక్కడ.ప్రశ్న.ఎవరు ఎవరితో ఎన్ని దినాలు ఉంటారో తెలియదు.ఉన్న మున్నాళ్ల రోజులు పగలు ప్రతీకారాలు ఉత్తుత్తి ప్రేమలు ఊపిరి పోయాక అయ్యో అన్న ఉపయోగం ఉండదు కదా.ఉన్నది ఒకటే జీవితమన్నది తెలిసినా ఆ ఒక్క జీవితానికి ఎన్నెన్ని చిక్కులు చిరాకులు చివరికి వ్యధలు ఆపై కథల కథలు.ఎన్ని కథలు అల్లినా ఎన్ని కుయుక్తులు చేసిన కట్టే కాలిన తరువాత అంతా సూన్యమే.అయినా ఆ కట్టే కాలే లోవు కనిపించని కట్టుకథలు ఎన్నెన్నో. ఉండేది ఎంత కాలమన్నది ఎవరికి తెలియదు జీవితం క్షణ బంగురం లాంటిది ఈ కాస్తంత కాలం లో కొట్లాటలు ఆటుపోట్లు అవమానాలు అన్ని ఇన్నీ కావు.తనువు ఉన్నప్పుడు మనుసుండదు మృగాలకంటే తక్కువుగా ఉంటాము ..ఆ మనస్సు ఉన్నప్పుడు ఈ తనువు ఉండదు ఈ తడబాటు తప్పదని తెలిసినా తన్నులాటలు తప్పడడం లేదు.తుది శ్వాస పోయాక తన్నులాడిన తప్పు జరిగిందని తెలుసుకున్న తొందర పాటన్న తిరిగిరాదు గా ఆ శ్వాస. ఈ అవనిపై పుట్టుక గిట్టుక అంతా కూడా ఓ మాయ. పుట్టుక గిట్టుక మధ్యలో ఎన్నో ఆటుపోట్లు పెట్టినా అవన్నీ అదిగమించి తమ స్వరంతో ఎన్నో స్వరాల్లో చలనం తెప్పిస్తే చివరికి ఆ స్వరంపై భిన్న స్వరాలు బైటికీ వస్తాయ్. అయినా అన్నీ బరిస్తే ఆఖరికి ఆ సర్వేశ్వరుడు ఈ స్వరాన్ని పూర్తిగా మటుమాయం చేస్తున్నాడు అందమైన కంఠాన్ని ఇచ్చిన ఆ కళామ తల్లి ఆ కంఠం కొన్ని ఖండాలకయిన చేరక పోతుందా అని ఆనందంగా ఎదురు చూసే లోపే కనిపించని మృత్యువు రూపంలో కాటు వేస్తుంది.ఆ కంఠం లో ప్రాణం ఉన్నప్పుడు ఎన్నెన్ని కీచులాటలు మరెన్నెన్నో కారుకుతలు అయినా చివరికి పాడేకెక్క తప్పుదు.ఓ కళామాతల్లి ఏందుకే ఈ కవ్వింపు …ఏమి పాపం చేసిందని నా పావని ప్రాణాలను పైకి తీసుకెళ్లి పోయావ్.నీకెందుకే ఇంత కుళ్లు ఆ కసి కూనపై… ఇంకెన్ని చేసినా ఆ కంఠం ఇక తిరిగిరాదని తెలిసినా కనికరం లేని ఆ కలికాలం లో ఇలాంటి కన్నీటి వ్యధలు ఇంకెన్ని చూడాలో… పావని ఓ పావని నీ పయనం అందరికి జ్ఞానోదయం కావాలని కన్నీటితో నీ ఆత్మ శాంతించాలని నీ కుటుంబానికి జరిగిన లోటు మరెవ్వరికి రాకూడదని అశ్రునయనాలతో ఆవేదన మిగిల్చి అందనంత దూరానికి పోయిన నిన్ను ఆజన్మాంతం మరువలేమని మరుజన్మ ఉంటే మన స్నేహం కొనసాగాలని మనసారా ఆ దేవుడిని కోరుకుంటూ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article