Thursday, November 28, 2024

Creating liberating content

రాజకీయాలుతప్పు చేయనప్పుడు తడబాటు దేనికి..?

తప్పు చేయనప్పుడు తడబాటు దేనికి..?

ఏపీ లో తెలంగాణ వారిదే పెత్తనమా..
తెలంగాణ లో ఏపీ వారిని అడుగుపెట్టనిస్తారా..
ఇదేనా ప్రెస్ క్లబ్ వ్యవహారం…
ప్రెస్ క్లబ్ అంటే కొందరిదా అందరిదా ..
ఓ వైపు ప్రెస్ మరో వైపు కుల సంఘాలుండొచ్చా..
వారు మాత్రమే సభ్యులా మిగిలిన వారు సభ్యులు కాదా ..
వారికేమైన ప్రత్యేక రాజ్యాంగం ఉందా..
లేక వారే నిర్ణయాధి కారులా..
రెండు కోట్ల బకాయిలు ఎవరు కట్టాలి..
రాబడి ఎవరి ఏలుబడికి వెళ్ళింది..
చిన్న పత్రికలు అయితే వారు చెప్పిందే చిత్త మనాలా ..
దమ్ముంటే ఓ పత్రిక నడుపుతార..
చిన్న పత్రికలు అంటే చిన్న చూపా..
మీరు మీ సభ్యులంతా నేషనల్, ఇంటర్నేషనల్ నా..
జగన్ వద్దు ..ఆ పాలసీలు కావాలి ..
ఇదే కదా కూటమిలో కుట్రలు..
చంద్రబాబు కు మచ్చతెచ్చేది ఇలానే కదా..
ప్రభుత్వం మారినా ..కొత్త సీసాలో పాత సార లానేనా..
ఇదేమి చిత్తశుద్ది… ఇదేమి పెద్దరికం..
ఛీ.. ఛీ..సిగ్గుతెచ్చుకోండి ఇక నైనా…

(రామమోహన్ రెడ్డి, సంపాదకులు)
” ఔను నిజం, ఔను నిజం ఔను నిజం, నీవన్నది,నీవన్నది, నీవన్నది,నీవన్నది నిజం, నిజంలేదు సుఖం, లేదు సుఖం,లేదు సుఖం జగత్తులో!బ్రదుకు వృథా, చదువు వృథా,కవిత వృథా! వృథా, వృథా!మనమంతా బానిసలం,గానుగలం, పీనుగలం!వెనుక దగా, ముందు దగా,కుడి యెడమల దగా, దగా!మనదీ ఒక బతుకేనా?కుక్కల వలె, నక్కల వలె!మనదీ ఒక బతుకేనా?సందులలో పందులవలె!నిజం సుమీ, నిజం సుమీ,నీవన్నది నిజం సుమీ! “
అని మహాప్రస్థానం లో శ్రీశ్రీ అన్నట్లు బెజవాడ ప్రెస్ క్లబ్ పరిస్థితి తయారైంది. కొంతమంది స్వార్ధ పరుల స్వప్రయోజనాల కోసం సమాజంలో ఎంతో ఉన్నతంగా ఉండాల్సిన జర్నలిజాన్ని నీచమైన స్థితికి దిగజార్చి వేస్తున్నారు.ఈ ప్రక్రియలో కొంతమంది మేధావులు కూడా వీరి ఉచ్చులో పడి రొచ్చు పూసుకుని రోడ్డెక్కే పరిస్థితి తీసుకవస్తున్నారు.రాష్ట్ర విభజనకు ముందు వీరి దురాఘాతం బైటికి కనిపించక పోయింది.రాష్ట్ర విభజన తరువాత జర్నలిస్టుల సంఘాల పేరుతో సంచులు నింపుకునే పరిస్థితి ఏర్పడింది. కారణం కుల మత వర్గ భేదాభిప్రాయాలు తెరమీదికి తెచ్చి కులాల కుంపట్ల మాటున కొంపలు కూల్చే పనులు చేస్తూ కోట్ల రూపాయల డబ్బు జర్నలిస్టుల సంక్షేమం కోసం ఖర్చు చేయ కుండానే ప్రభుత్వాల కు బజాయిలు పడ్డారు.విభజన జరిగి పది సంవత్సరాలు జరిగిన రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం ఏ సంఘం సక్రమంగా పనిచేసిందంటే ఎవరూ కూడా నోరుమే మొదపని స్థితి ఉంది. ఇక సంఘాల పేరుతో గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అందిరిని సంక నాకిస్తూ వారు మాత్రం సన్మాలు సత్కరించటం చేస్తూ చంకలు గుద్దుకుని మెల్లగా సర్దుబాటు చేసుకుంటూ ఎవడైనా వేలెత్తి చూపితే వాడిది చిన్నది నాది పెద్దది మా తాతలు నేతులు నాకారు మేముకుడా అదే నాకుతున్నాం అంటూ మూతులు నాక్కుంటూ నాది ఇంత గొప్ప అని వాపు ను చూసి బలుపు అనుకుంటూ బధనాం చేస్తుంటే పట్టించు కునే నాధుడు కరువయ్యారు.ఈ నేపధ్యంలో వీరి ఆగడాలు చూసి భరించలేని కొంతమంది జర్నలిస్టులు పోరాటాలు చేస్తుంటే సిగ్గు ఎగ్గు లేకుండా తమ తప్పులు కప్పిపుచ్చుకునేందుకే వారు చిన్న పత్రికలు ప్రింటింగ్ లేదు..ఇలా వల్లే మాలిన మాటలు చెబుతూ వంచనకు దిగుతున్న వీరిని చూస్తే గురివింద కింద ఉన్న నలుపు ను మరిచినట్లు ఉంది కదా అని అవాక్కవతున్నారు కొందరు. పత్రికొక్కటున్న పదివేల సైన్యము, పత్రికొక్కటున్న మిత్రకోటి, ప్రజలకు రక్ష లేదు పత్రిక లేనిచో… ” అని చెప్పారు అనాటి పెద్దలు.ఎడిటరైనవాడు బిడియము చూపుచో ధాటి తగ్గు వృత్తి ధర్మమందు, కడుపుకూటి రాత కక్కుర్తి రాతరా’ అంటూ తోటి రచయితలనూ, భావి సంపాదకులనూ హెచ్చరించిన యోధులున్నారు.ముఖ్యంగా జర్నలిజం రంగంలోకి అడుగుపెట్టేవారు నిజాయతీగా, నిర్భీతిగా ఉండాలని కోరిన పాత్రికేయుడు నార్ల. “నిజము కప్పిపుచ్చి నీతిని విడనాడి స్వామి సేవ సేయు జర్నలిస్టు తార్చువాని కంటే తక్కువ వాడురా” అని కుండ బద్దలుగొట్టినట్లు చెప్పడం నార్లవారికే చెల్లింది. “ఏ ఎండకు ఆ గొడుగు పట్ట నేర్చినవాడు ఏమైనా కావచ్చునేమో కానీ, నిజమైన ఎడిటర్ కానేకాడు.” అని నిష్కర్షగా చెప్పేవారు నార్ల. మరి ఇంతటి ప్రామాణికం ఉన్న పత్రికా వ్యవస్థ లో ఉంటూ పనికిమాలిన అక్షర జ్ఞానం లేని అవివేకులాగా మాట్లాడటం అంటే వీరంత మేధావులో అర్థమవుతుంది. జీతాలు తీసుకుంటూ ఏదో ఒక కథనం రాసుకుని ఆహా ఓహో అని గొప్పలు పోవడం కాదు ఏదయితే మీకు చిల్లర గా ,చిన్న చూపుగా కనిపిస్తుందో అదే అలాంటి పత్రిక అనుమతి పొంది ఆగకుండా పిడిఎఫ్ తీస్తే తెలుస్తుంది. మునుపటికి ఒక సామెత ఉందట… పొలం లో ఎద్దు దుక్కి దున్ని అలసిపోతుంటే ఎక్కడో ఏదో ఊగిసలాడుతున్నది ఆయాస పడిందట అలా ఉంది కొంతమంది మేధావులమని చంకలు గుద్దుకునే సంఘాల నేతల తీరు. ఇకపోతే ప్రెస్ క్లబ్ ఇప్పటికే గబ్బుపట్టి గలీజు గా ఉంటే తెలంగాణ పెద్దల పెత్తనం మళ్లీ. సరే మీ యూనియన్ పెద్దలు మీకు అండగా ఉన్నారు కాబట్టి మీరు సలామ్ కొట్టడంలో తప్పులేదు. మీకు దమ్ము ఉంటే తెలంగాణ ప్రెస్ క్లబ్ లో మీకు చోటు దక్కించుకోండి అంటే అబ్బే మాకెందుకు మాది పెద్ద గబ్బుపట్టిన క్లబ్ ఉందిగా అంటూ బీరాలకు పోవడం. ఇదేమి సంస్కారం అంటే అది అంతే అని భుజాలు తడుముకోవడం.ఇవన్నీ చూసి తలలు పట్టుకుంటున్న సమాచార శాఖ మంత్రి ఇంత సమాచారం ఉందా ఉంటూ అవాక్కవతున్నారు. ఇదిలా ఉండగా కూటమి ప్రభుత్వం వచ్చింది కొత్త విధానాన్ని అమలు చేసి జర్నలిస్టుల కు భద్రత కోసం తప్పనిసరి చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటుంటే పాత ప్రభుత్వ విధానాలు బాగున్నాయని అధికారులు చెబుతుంటే ఇంకా వీరంతా వైసీపీ ప్రభుత్వ జమానాలో నే ఉన్నారా లేక ఇంకేదయిన ఉందా అన్నది అర్థం కావడం లేదు. మొత్తానికి ఎన్నో ఏళ్ళు పోరాటం చేస్తున్న ప్రెస్ క్లబ్ సాధన సమితి సభ్యుల కృషి ఎట్టకేలకు పలించి గబ్బుపట్టిన ప్రెస్ క్లబ్ ను ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోందని చెప్పడం సంతో సించ దగ్గ విషయం గా చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article