Thursday, November 28, 2024

Creating liberating content

రాజకీయాలుజర్నలిస్ట్ అంటేఎవరు..?

జర్నలిస్ట్ అంటేఎవరు..?

అక్షర జ్ఞానం అక్కర్లేదా…
నాలుగో స్తంభంకూడా అంత చులకన అయిందా …
తాపీ మేస్త్రీ లారీ డ్రైవర్లు కూడా
జర్నలిస్టులవుతారా..
జర్నలిజం అని ఇంగ్లీష్ లోకాదు తెలుగులో కూడా రాయడం రాకపోయినా కూడా..
అక్రమంగా అక్రిడేషన్ పొందితే వాడు జర్నలిస్ట్ అయినట్లేనా..
డబ్బులిచ్చి కార్డుకొంటే వాడు రియల్ జర్నలిస్ట్ అయినట్లేనా…
అక్రిడేషన్ ఉండి సంస్థ ఐడి కార్డు లేకున్నా ఒకటేనా…
సంస్థలకు తెలియకుండా ఐడి కార్డ్లు ఉన్నా జర్నలిస్ట్ అవుతాడా..
అక్రమాలకు అండగా ప్రెస్ ఐడి కార్డ్ పనిచేస్తుందా..
పోలీసులు కూడా కళ్ళుమూసుకున్నారా
సమాచార శాఖ సచ్చుపడిపోయిందా…
ఎవడు జర్నలిస్ట్…ఏది జర్నలిజం ..

(రామమోహన్ రెడ్డి,సంపాదకులు)
సమాజంలో ఎవడు జర్నలిస్ట్ ఏది జర్నలిజం అన్న అనుమానాలు ప్రస్తుత కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి.దశాబ్ద కాలం కిందటి వరకు ఉన్న పరిస్థితులు ఇప్పటి పరిస్థితులు చాలా భిన్నంగా మారిపోయాయని చెప్పడంలో సందేహపడాల్సిన పనిలేదు.కారణం పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో సగటు మనిషి అవసరాలు,అక్రమాలు, ఆడంబరాలు ఎక్కువగా ఉండటమే ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ప్రధానంగా వార్తలను, ఇతర సమాచారాన్నీ సేకరించి ప్రజలకు అందించేవారు పాత్రికేయులు. ఈ వృత్తి పేరు పాత్రికేయ వృత్తి. వారు సామాన్య విషయాలపై పనిచెయ్యవచ్చు, ప్రత్యేకించి ఒక రంగంలో విశేష కృషి చెయ్యనూవచ్చు. ఎక్కువ మంది పాత్రికేయులు ఒక రంగంలో కృషి చేసి, నైపుణ్యం సాధించేందుకు మొగ్గు చూపిస్తారు. ఇతర నిపుణులతో కలిసి వివిధ విషయాలపై రచనలను కూర్చి పత్రికలను వెలయిస్తారు. ఉదాహరణకు, క్రీడల పాత్రికేయులు క్రీడలకు సంబంధించిన వార్తలపై పనిచేస్తారు. అయితే వీళ్ళు అనేక రంగాల వార్తలను ప్రచురించే వార్తా పత్రికలో పనిచేస్తూండవచ్చు.

సమాజంలో ఎవడు జర్నలిస్ట్ ఏది జర్నలిజం అన్న అనుమానాలు ప్రస్తుత కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి.దశాబ్ద కాలం కిందటి వరకు ఉన్న పరిస్థితులు ఇప్పటి పరిస్థితులు చాలా భిన్నంగా మారిపోయాయని చెప్పడంలో సందేహపడాల్సిన పనిలేదు.కారణం పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో సగటు మనిషి అవసరాలు,అక్రమాలు, ఆడంబరాలు ఎక్కువగా ఉండ టమే ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ప్రధానంగా వార్తలను, ఇతర సమాచారాన్నీ సేకరించి ప్రజలకు అందించేవారు పాత్రికేయులు. ఈ వృత్తి పేరు పాత్రికేయ వృత్తి. వారు సామాన్య విషయాలపై పనిచెయ్యవచ్చు, ప్రత్యేకించి ఒక రంగంలో విశేష కృషి చెయ్యనూవచ్చు. ఎక్కువ మంది పాత్రికేయులు ఒక రంగంలో కృషి చేసి, నైపుణ్యం సాధించేందుకు మొగ్గు చూపిస్తారు. ఇతర నిపుణులతో కలిసి వివిధ విషయాలపై రచనలను కూర్చి పత్రికలను వెలయిస్తారు.
ఉదాహరణకు, క్రీడల పాత్రికేయులు క్రీడలకు సంబంధించిన వార్తలపై పనిచేస్తారు. అయితే వీళ్ళు అనేక రంగాల వార్తలను ప్రచురించే వార్తా పత్రికలో పనిచేస్తూండవచ్చు. టోక్యోలో మాక్రాన్ ప్రసంగం తర్వాత BFM TV జర్నలిస్ట్ వివిధ పద్ధతుల ద్వారా పరిశీలన జరిపి వార్తలను సేకరించి వార్తాపత్రికలు, మేగజైన్ల ద్వారా అందించే పద్ధతిని ప్రింట్ మీడియా అని, టెలివిజన్, రేడియో, డాక్యుమెంటరీ చిత్రాల ద్వారా అందించే పద్ధతిని ఎలక్ట్రానిక్ మీడియా అని, అన్ లైన్ ద్వారా అందించే పద్ధతిని డిజిటల్ మీడియా అనీ అంటారు పాత్రికేయ వృత్తిలో -రిపోర్టర్లు, సబ్-ఎడిటర్లు, ఎడిటర్లు, కాలమిస్టులు, ఫోటో జర్నలిస్టులు మొదలైన అనేక పాత్రలున్నాయి. సమాచారాన్నిన్ సేకరించే వారు రిపోర్టర్లు. రిపోర్టర్లు తమ సమయాన్ని రెండుగా విభజించుకుంటారు. క్షేత్ర స్థాయిలో సమాచారం సేకరించడం ఒక భాగం కాగా, న్యూస్‌రూములో పనిచెయ్యడం రెండవ భాగం. రిపోర్టర్లకు ఒక ప్రత్యేకించిన ప్రాంతంలో పనిచేస్తారు. దీన్ని బీట్ అంటారు. ఇలా వృత్తి పరంగా కొనసాగే వారిని జర్నలిస్ట్ లని అలా సాంప్రదాయం ప్రకారం ఉండేదాన్ని జర్నలిజం అంటారు.కానీ నేడు జర్నలిజం అనేది బజారు పాలు చేస్తున్నారు కొందరు బజారు వ్యక్తులు. ఆనాటి మహనీయులు శ్రీ పానుగంటి లక్ష్మీనరసింహం గారు సాక్ది వ్యాసాలలో రచించిన విదంగా “ఒకడికి కొంత పరిజ్ఞానం ఉన్నందున అటు సూర్యుడు ఇటు ఎందుకు ఉదయిస్తాడో తెలియదు,ఇటు చంద్రుడు ఎందుకు ఈ వైపు హస్తమిస్తాడో తెలియక పోయిన ఈ ప్రపంచాన్ని మార్చేస్తానని”అన్నాడట అలా కొంతమంది మిడిమిడి జ్ఞానం కలిగిన మేధావులు జర్నలిజం అనే ముసుగులోకి దూరి తమ అవినీతి అక్రమాలకు అండగా ఉంటుందని ఓ సంస్థలో చేరడం అసంస్థ ఐడి కార్డులు ఇంట్లో ఉన్న బంధువులకు తోడల్లుడు కి ఇవ్వడం వారందరినీ జర్నలిస్టులుగా సమాజానికి పరిచయం చేయడం పరిపాటిగా మారింది. ఇలా నకిలీ జర్నలిస్ట్ లుగా అవతరమెత్తిన కొంతమంది నీచులు పొద్దున్నే మొదలు నీతిమాలిన పనులుకు అడ్డుకట్ట గా పెట్టుకుని జీవిస్తూ మళ్లీ రాష్ట్ర రాజకీయాలు అన్యాయం అవినీతి పై డిబేట్లు,విశ్లేషణలు కథనాలను ఇవ్వడం కూడాను.చేసేది శివపూజ వెళ్ళేది అక్కడికి అన్నట్లు ఓ ఆరు సూత్రాలు చెప్పే టీవీ చానెల్ లో అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. ఆ ఛానెల్ ప్రతినిధి గా చెప్పుకొనే ఓ మేధావి తన తమ్ముడి కి నకిలీ ఐడి కార్డు ,తన తొడల్లుడికి అక్రిడేషన్ ఇవ్వడం వారంతా జర్నలిస్ట్ లు గా ఏలుబడి సాగిస్తుంటే రియల్ జర్నలిస్ట్ లు సంకనాకి పోతున్నారు. ఇంకొకడు అయితే ఏలూరు నుంచి అదే పనిగా అడ్డ దారిలో డబ్బులు ఇచ్చి అక్రిడేషన్ పొంది పొద్దున లేస్తే బిల్డింగ్ ల దగ్గర మాముల్లకోసం పరుగులు తీయడం మళ్లీ అసెంబ్లీ పాసు ఉందని చెప్పుకుంటూ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వసూళ్లు చేసుకుంటూ ఆరడగుల బుల్లెట్ అని చెప్పుకుంటు ఆ బుల్లేట్ పొడవు లేకపోయిన నేషనల్ ఛానెల్ అని గొప్పలు చెప్పుకోవడం.వాడిని గతంలో ఏలూరు లో కరంట్ స్తంబానికి కట్టేసి ఇరగదీసినట్లు కూడా వదంతులు వినిపిస్తున్నాయి. పోలీసు కేసులు కూడా ఉన్నట్లు సమాచారం. ఇంకొంతమంది ఆటో డ్రైవర్లు, తాపీ మెస్త్రీలు కూడా వసూళ్ల పర్వం కోసమే జర్నలిస్ట్ లుగా అవతారమెత్తి సమాజంలో జర్నలిజం జర్నలిస్ట్ లకు ఉన్న ప్రమాణాలను తుంగలో తొక్కి పబ్బం గడుపుకుంటుంటూ ఏకంగా పోలీస్ స్టేషన్ల పై కూడా నేరుగా వార్తలు వస్తున్నా పోలీస్ అధికారులు కూడా చేష్టలుడిగి ఉన్నారన్న ధోరణిని కి ప్రజలు వచ్చారు.ఇక సమాచార శాఖ తమ సంచులు నింపుకొవడానికే సరిపోతుంది వారి ఉద్యోగ కాలం.ఈ పరిస్థితుల్లో మీడియా ఉంటే ప్రజా సమస్యలు తెలిసేది ఎలా తెలిపే ప్రయత్నం చేసినా పట్టించు కునే వారు ఎవరన్నా ప్రశ్న మేధావుల ద్వారా ఉత్పన్నం అవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయినా నకిలీ మీడియా పై చర్యలు తీసుకుంటే బాగుంటుందని మెజార్టీ జర్నలిస్టుల అభిప్రాయం. మరి ఏమి చేస్తారో వేచిచూద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article