Thursday, November 28, 2024

Creating liberating content

రాజకీయాలుఅక్రమ నిర్మాణాలను అడ్డుకునే వారెవరు..

అక్రమ నిర్మాణాలను అడ్డుకునే వారెవరు..

బిల్డర్ లే ఓనర్ లు గా చెలామణి అవుతుంటే..
టీపీఓ లకు చేతులు తడిపితే చాలు..
వార్డు సెక్రటరీ, సచివాలయ సిబ్బంది చేతి వాటం చూపిస్తుంటే..
చక్కగా అక్రమ నిర్మాణాలు వెలుస్తుంటే…
మేమున్నామంటూ ముందుకు కార్పొరేటర్లు వస్తుంటే…
అక్రమ లేవట్లు… అక్రమ నిర్మాణాలు సాగుతుంటే ..
అవైపు కన్నెత్తి చూసేవారు లేకుంటే ..
అంతా అవినీతి మయం… అంతా వారిష్టమే అవుతుంటే…
అడిగితే ప్లాన్ ఉందంటూ అడ్డగోలు వాదనలు…
ఆపై రాజకీయ నాయకుల ఫోన్లు…
అందరూ మంచివారే…అక్రమాలు సక్రమమే…
అడ్డదారిలో అడ్డంగా దోచుకుంటున్న ఆఫీసర్స్..
ప్రశ్నిస్తే పరిశీలిస్తామంటూ పసలేని మాటలు…
ఇదేనా కార్పొరేషన్ తీరు…వీరేనా కట్టడి చేసేది…


(రామమోహన్ రెడ్డి, సంపాదకులు)
అక్రమం అన్యాక్రాంతం ఏదైనా సరే కాసులిస్తే కార్పొరేషన్ లో కానీ పని ఏదీ లేదంటూ ఉండదు.ప్రజలు కట్టే టాక్స్ తో జీతాలు తింటూ కూడా లంచాలు ఇవ్వనిదే అదే ప్రజ లకు పనిచేసే వెసులుబాటు లేకుండా పోతుంది బెజవాడ కార్పొరేషన్ లో.ప్రభుత్వ నిబంధనలు కేవలం ఒక సామాన్యుడికే తప్ప మిగిలిన వారికి ఏ నిబంధనలు వర్తించవు అన్న సంస్కృతి ఇక్కడ చోటు చేసుకుంది. గత ముఖ్యమంత్రి గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం పునరుద్ధరణ చేస్తా నని గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేస్తే అవి గాడ్సే నిలయాలుగా మరాయన్న అపవాదు లేకపోలేదు. బెజవాడ నగరం సహజంగా నే అభివృద్ధి చెందుతుంది. రాజధాని అమరావతి పరిధిలోకి విజయవాడ ఉండటం కూటమి ప్రభుత్వం అమరావతి అభివృద్ధి కి ప్రణాళికలు వేస్తుండటం తో నగర అభివృద్ధి శరవేగంగా జరుగుతోంది. ఈ నేపధ్యంలో ఎన్నో కట్టడాలు వెలుస్తున్న కార్పొరేషన్ నుంచి అనుమతులు ఏ మేర తీసుకుని నిర్మాణాలు చేపడుతున్నారో అదంతా కార్పొరేషన్ లో ఉన్న అవినీతి తిమింగళాలకే తెలియాల్సి ఉంది ఇక్కడ ప్రధానంగా బిల్డర్లే కార్పొరేషన్ అధికారులతో కుమ్మక్కై అనుమతుల విషయం లో ఆమ్యామ్యా చేసుకుంటూ అంతా పని కానిచ్చేస్తున్నారు. టిపిఓ లు అయితే సచివాలయం సెక్రటరీ ద్వారా కొన్ని చేస్తే మరి కొన్ని నేరుగా వారే అనుమతి ఇచ్చేస్తున్నారు.

ఇంకొందరు అయితే సిటీ ప్లానర్ కు అమ్యామ్యా లు అప్పజెప్పి అనుమతులు ఇప్పిచ్చేస్తున్నారని ఆరోపణలు లేకపోలేదు. గతంలో టిపిఓ గంధం ప్రసాద్ ,ఏసీపీ జగదీష్ లు అయితే వారు ఆడిందే ఆట పాడిందే పాట గా లంచాలు ఇస్తే ఓకే లేకుంటే కట్టడాలు కూల్చివేయడం చేసేవారు.ఇలాంటి సంఘటనలు బోలెడు ఉన్నాయి.ఈ అవినీతి తిమింగళాలు తిన్న కాసులు, చేసిన కక్కుర్తి పనులు అయితే లెక్కలేనన్ని.ఈ తప్పుడు అధికారులకి కార్పొరేటర్లు భాగస్వామ్యం అవ్వడం కలిసి వచ్చింది. గత ప్రభుత్వ హయాంలో కార్పొరేషన్ మెజార్టీ వైసీపీ వారే ఉండటం కట్టడాలు కుంభకోణం భారీగా జరిగాయి.భవనిపురం ఏరియాలో ఇప్పటికీ ఐరన్ యార్డ్ లో అనుమతులు లేనివి కొని,అనుమతి ఇంటి కోసం తీసుకుని వ్యాపార సముదాయాలు నిర్మాణం చేసేవి కొన్ని.ఇదంతా అక్కడి కార్పొరేటర్ల కనుసన్నల్లోనే ఈ అవినీతి గంధం ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగాయి. జరుగుతున్నాయి.ఇదంతా సిటీ ప్లానర్ కు తెలిసీన భవనిపురం ఏరియాలో ఉన్న వైసీపీ కార్పొరేటర్ చక్రం తిప్పుతున్నారు.కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా వైసీపీ కార్పొరేటర్ల కబంధ హస్తాల్లో నే అక్రమ కట్టడాలు జరుగుతున్నాయంటే ఇది కూటమి ప్రభుత్వ వైఫల్యమా లేక అధికారుల అవినీతి రాజ్యం ఇంకా ఏలుబడి సాగిస్తుందా అనేది అర్థం కావడం లేదు. ఇప్పటికయిన మున్సిపల్ కమిషనర్ ద్యానచంద్ర ద్యాస పెడతాడా లేక ఆయన్ని కూడా దారీ మల్లిస్తారా చూడాలి మరి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article