దేశముఖ చిత్రంలో ఏపీ ఆదర్శమవుతుందా…
ఐదు కోట్ల ఆంధ్రులు ఎవరిని కోరుకుంటున్నారు…
జగన్నాటకం లో కూటమి కుప్పకూలుతుందా
కూటమి దెబ్బకి ఫ్యాన్ రెక్కలు ముక్కలు ముక్కలుగా..
మళ్లీ చంద్రోదయం వస్తుందా
జగన్మోహనుడి సమ్మోహనాస్త్రం ఫలిస్తుందా…
ఓటర్ల చైతన్యం ఎవరికి ఎవరికి వెలుగులు నింపుతుందో…
సర్వేలు అన్నీ సత్యమేనా…
సంక్షేమం సకాలంలో ఫలితాలు ఇస్తుందా..
ప్రజా తీర్పు @2024 ….
(రామమోహన్ రెడ్డి,సీనియర్ పాత్రికేయులు,అమరావతి)
ఐదుకోట్ల ఆంధ్రుల కలలు సాకారం చేసేది ఎవరన్నది ఇప్పటికే ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్నది.70 సంవత్సరాల స్వాతంత్ర్యము తరువాత కూడా బ్రతుకు జీవుడా అన్న విధానం లో ఎన్నో కుటుంబాలు ఇప్పటికీ దుర్భర పరిస్థితి ఎదుర్కొంటూ ఛిద్రమవుతున్నా యి.ఇన్నేళ్లలో పేదవాడు పెడవాడిగానే మిగిలి పోయారు.గత ఐదు సంవత్సరాలలో రాష్ట్ర అభివృద్ధి అనే మాట కొంచెము అటు ఉంచితే పేద ప్రజలు ప్రభుత్వం అందించిన సంక్షేమ ఫలాలతో కొంతమేరైన ఉపశమనం పొందారని ఒప్పుకోక తప్పదు.మారిన రాజకీయ,దేశ రాష్ట్ర భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా కులాల కుంపట్లు, రాజకీయ ప్రయోజనాలు,వ్యక్తిగత స్వార్థం కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు.
అయితే రాష్ట్ర చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో ఓటర్ల చైతన్యం వచ్చింది. ఏపీ ఎన్నిక దేశ ముఖ చిత్రాన్ని మార్చేయగలదు అన్న ధోరణిలో ఈ ఫలితాలు ఉండబోతున్నాయన్నది అక్షర సత్యంగా నిలుస్తుంది.పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం, మేధస్సు కూడా ఓటరు నాడిని పసిగట్టలేని స్థితిలో ఉండి పోయాయంటే ఈ ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయో అర్థమవుతుంది.దేశంలో పేరు మోసిన సర్వేసంస్థలలో కొన్ని అనుకూల ప్రతికూలముగా ఆయా రాజకీయ పార్టీల వంత పాడుతున్నాయనే విమర్శలు మూతకట్టుకుంటున్నాయి.
మారిన రాజకీయ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓ నూతన ఒరవడి కి శ్రీకారం చుట్టారని చెప్పాలి.అయితే జగన్మోహనుడి సంక్షేమం చూసి ఓటర్ల చైతన్యం పెరిగిందా.. కూటమి కోటరీ చూసి పెరిగిందా అంటే స్పష్టమైన నిర్ణయం చెప్పలేని పరిస్థితి. కూటమి ఇప్పుడు కొత్తగా ఏర్పడింది కాదు…2014 లోకూడా కూటమిగా ఏర్పడి ప్రజతీర్పును అనుభవించారు.ఆ తరువాత జగన్మోహనుడి కి పట్టం కట్టారు.
ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నట్లుగా ఒక్క చాన్స్ ఇచ్చారన్నది నిజమైతే మళ్లీ చంద్రోదయ కాంతులు వస్తాయి.ఒక వేల అలా కాకుండా జగన్మోహనుడి జగన్నాటకం పలిస్తే కూటమి కూలిపోక తప్పదు.
అయితే ఏది నిజం ఏది అబద్ధం అన్నది ఇంకో 48 గంటల తరువాత గ్రహణం వీడి అందరి కళ్ళకి కాంతులు వస్తాయి.ఫలితాలు ఎలాగూ ఎవరూ మార్చలేక పోయిన గతానికి భిన్నంగా రాష్ట్ర యంత్రాంగం కావచ్చు, కేంద్ర,రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రతి ఓటరు మదిలో కొంగొత్త ఆలోచన రేకిస్తున్నాయి.ఫ్యాన్ ప్రభంజనం సృష్టిస్తే ఆనందంలో చేసే అల్లర్లు, కావచ్చు కూటమి గెలిస్తే జరిగే కుట్రలు కావచ్చు ఏదయినా రాష్ట్ర స్థాయిలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందన్న ముందస్తు సమాచారం అయితే నిఘా అధికారులు పసిగట్టి గట్టి చర్యలే చేపట్టారు.
మరి ఇలాంటి పరిస్థితులలో ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం తేదీ సమయం ప్రకటించడంతో పాటు..విశాఖలో వేదిక ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.రాష్ట్ర దేశ మీడియా ఎవరి స్థాయిలో వారు తమ విశ్లేషణ లు చేస్తున్నారు. ప్రజలు మాత్రం గందరగోళం లో ఉన్నారు. ఏమి జరుగుతుందో ప్రజాతీర్పు@2024 ఎలా ఉండబోతుందో తెలియాలంటే ఇంకో 48 గంటలు వేచి ఉండాల్సిందే…