కార్తీకంను హిందువులంతా ఎంతో పవిత్రంగా భావిస్తారు.ఈ మాసంలో ముఖ్యంగా దీపారాధన, నదీస్నానం, దానాలు గురించి ఎక్కువగా చెబుతుంటారు. కార్తీక మాసంను దేవతలకు దీపావళి మాసంగా చెబుతుంటారు. ఈ మాసంలో ఏ పూజలు చేసిన కూడా అది అఖండమౌతుందని చెబుతుంటారు .అంటే మనంచేసిన దేవత కార్యక్రమాలకు, వ్రతాలు, పూజలకు వెయ్యిరెట్లు ఫలితాలు ఇస్తుందన్నమాట.అందుకు కార్తీక మాసంను శివ, కేశవులు కూడా తమకు ఇష్టమైన మాసం అని కొన్ని పురాణాలలో చెప్పారంట. ఈ మాసంలో ప్రతిరోజు సూర్యోదయానికి ముందు నిద్రలేవాలి. అంతే కాకుండా.. దేవుడి దగ్గర శుచీగా దీపారాధర చేయాలి.అంతే కాకుండా.. ఈ మాసంలో ఉసిరి పండు మీద దీపావరాధన చేయాలి. తులసీ వివాహాం జరిపించాలి. ఫలాలు, సాలగ్రామాలను పండితులకు దానంగా ఇస్తే మంచి జరుగుతుందని పెద్దలు చెబుతుంటారు. అయితే.. కార్తీక మాసంలో మాత్రం చాలా మంది 364 దీపపు వత్తుల్ని వెలిగించాలని చెబుతుంటారు. అయితే.. దీని వెనుక ఒక పరామార్థం ఉంది. అయితే.. చాలా మంది తమ ఇళ్లో ప్రతిరోజు దీపారాధన చేస్తుంటాం. కానీ కొన్నిసార్లు అనుకొని సందర్భాలలో దీపం పెట్టేందుకు వీలుపడదు. దీంతో ఆ ఇంటి యజమానికి దోషం చుట్టుకుంటుంది. ఇంట్లో దేవుడి ఆరాధన చేస్తే.. ప్రతిరోజు తప్పకుండా దీపారాధన చేయాలి. అలా ఏదైన ఒక రోజు లేదా కొన్ని రోజులు దీపం పెట్టకుండా ఉంటే.. అలాంటి దోషాలు పొయేందుకు కార్తీక మాసంలో పౌర్ణమి రోజున ఏడాదికి సరిపడా 365 దీపపు వత్తులతో దీపం వెలిగిస్తారు.దీని వల్ల ఏడాదిలో మనం ఏదైన ఊరికి వెళ్లిన లేదా మరే కారణం చేతకానీ.. దీపాలు వెలగించడం కుదరక పోతే.. అలాంటి దోషం ఈ 365 వత్తుల దీపంను వెలిగించి పొగొట్టుకొవచ్చంట. అందుకే చాలా మంది తప్పనిసరిగా.. కార్తీక పౌర్ణమి రోజున 365 వత్తుల దీపంను వెలిగిస్తారని పండితులు చెబుతున్నారు.