ఆ సంస్థ నిర్వాహకుడు అలా అవమానించవచ్చా..
తోటి గాయకున్ని తూలనాడటం తప్పు కాదా..
ఆ గబ్బంతా ఆ గది ముందే జరగడం గలీజుగా లేదా
ఆ గదే అన్నిటికీ మూలం అవుతుంటే..
ఆ గాన గంధర్వుడు గాడి తప్పాడా..
లేక గాయకుల్ని గాడి తప్పిస్తున్నాడా. .
గాత్రం లేదు…గమనం కూడా ఉండదా ..
వీరి చేష్టలతో గానాలు గాడి తప్పుతున్నాయా…తప్పిస్తున్నారా..
ఇంకెన్ని ఘోర మైన పనులు చేస్తారు ..
గొడవలు చేస్తారు…గాడి తప్పిస్తారు..గాంభీర్యం ప్రదర్శిస్తారు…
మొన్న సురేష్,నిన్న సింధు, నేడు..ఇతను… రేపు..?
ఇదేనా ఆ గది తీరు…
ఏమిటీ ఆ గది రహస్యం… ఆ గదిలో ఏమి జరుగుతోంది…
(రామమోహన్ రెడ్డి,సంపాదకులు)
ఆయనొక గాయకుడు మరియు సద్ బ్రాహ్మణుడు.సకలము తెలియక పోయినా సంగీతం అంటే ప్రాణమో లేక పిచ్చి కావచ్చు తనకు సరస్వతీ మాత అనుగ్రహముతో సినిమా పాటలు,ఆద్యాత్మిక పాటలు ఆలపిస్తాడు. అంత మాత్రాన ఆ గాయకుడు ఇతర గాయనీ గాయకుల కంటే తీసివేసేంత తప్పు ఏమి చేసాడో తెలియదు. కానీ అంత తప్పుగా తూలనాడాల్సిన పని ఎందుకు వచ్చింది అన్నదే ఇక్కడ ప్రశ్న. సహజంగా కౌతా వేదికగా అనేక అవమానకర సంఘటన లు చోటుచేసుకుంటునే ఉన్నాయి.అసలు కలకు సంభందించిన వారు అక్కడ లేక పోగా మేము కూడా కళాకారులమనే భ్రమ లో చాలా మంది ఉండటం కళారంగం చేసుకున్న దురదృష్టం గా భావించాలి.కళను ప్రోత్సహించడం కళను కాపాడే ప్రయత్నం చేస్తే అందరూ కూడా అభినందిస్తారు.కానీ ఇక్కడ కళ అంటే ఎక్కడ ఉంది ఎలా ఉంది ,ఎంత సొగసు గా ఉంది ,ఏ ఊరు,ఏ జిల్లా ,ఎలా వచ్చింది ఎక్కడ డ్రాప్ చేయాలి అనే బడుద్దాయిలు ఉన్న నేపధ్యంలో కళ ను వీరు బ్రతికిస్తారా అంటే ఆ కళామతల్లే కళ్ళు తెరిపించాలని కోరుకొంటోంది కళారంగం. ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి లో చీటీలు పేరుతో లూటీ చేసి పట్ట పగలే అందరి కళ్ళకు కారుచీకట్లను కమ్మే టట్లు చేసిన ఓ కళా సంస్థ అధినేత ఓ కళాకారుడి పట్ల అనుచితంగా ప్రవర్తించిన తీరు కళారంగం నివ్వెర పోయేలా చేస్తుంది. ఇలా జరగడం మొదటదేమి కాదని చెప్పాలి. ఈ ఏడాదిలో బహిరంగంగా జరిగిన అనేక అకృత్యాలలో ఇదొక ఉదాహరణ అని చెప్పాలి.ఎందుకంటే కౌతా గాడ్ ది ఫాదర్ గా తనకు తానే నామకరణం చేయించుకుని అందుకు ఒక వేదికగా ఓ గది ఏర్పాటు చేసుకుని అందులో అన్ని రకాల వేడుకలు నిర్వహిస్తూ ఏ కళాకారుడిని ఏమి చేయాలి, ఏ కళాసంస్థ ఏమి చేస్తుంది ఈ గది ని గుర్తించని ఇతర గదుల్లో ఏమి జరగకూడదు అన్న విధంగా గాన గంధర్వుడి బిరుదుని తనకే తానే మెడకు తగిలించుకున్న ఓ తప్పుడు పెద్ద మనిషి సింగర్,నక్షత్ర కళావేదిక అధ్యక్షుడు, జర్నలిస్టు వలపర్ల సురేష్ పై ఆ ప్రక్క గదిలో అవమానించారని, దాడి చేశారని, దూషించడమే కాకుండా వాలి పోతున్న వయస్సు, సంస్కారం మరిచి ఆఖరికి ఫ్యాన్ట్ జిప్పు తీసి కూడా ….రాయలేని విధంగా ప్రవర్తిస్తుంటే కొంతమంది మాజీ తాజా ఉద్యోగులు కూడా సపోర్ట్ నిలిచారని సురేష్ సత్యనారాయణపురం పోలీసులను అర్ధరాత్రి ఆశ్రయించిన అక్కడ కూడా తన పలుకుబడి తో అన్యాయం చేశారని ఆరోపిస్తునే ఉన్నారు.ఇది జరిగిన కొన్ని నెలలకే సింగర్ సింధు పై జరిగిన దాడి ప్రతి దాడులు కు ఆ గది నుంచే డైరెక్షన్ జరిగినట్లు సమాచారం .ఇలా ఎందుకు అనవలసి వస్తుందంటే పెప్పర్ స్ప్రే సంఘటన కు మూల పురుషుడు ఆ గదిలో కీలక వ్యక్తి అన్నది అందరికి తెలిసిన విషయమే. ఇలాంటి సంఘటనలు మరువక ముందే ఓ గాయకుడు ఓ కళాసంస్థ అధినేత కూసుకున్న గబ్బుకూతలు కూసుకున్న తీరు చూసి కళారంగం నివ్వెరపోతుంది. అయితే ఇవన్నీ కూడా ఆ గది వేదికగా జరుగుతుండటం కళారంగం చేసుకున్న దౌర్భాగ్యమా లేక దురదృష్టమా అన్నది అర్థం కావడం లేదు.ఇప్పటికయిన పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి చర్యలు చేపడితే తప్ప ఇలాంటి దురదృష్టకర సంఘటనలు పునరావృత్తం కాకుండా ఉంటాయని నిజమైన కళాకారులు కోరుకుంటున్నారు.