ముఖ్యమంత్రి అయినా మారక పోతివి
మీది మంచితనం అనుకోవాలా ..చేత గానితనం అనుకోవాలా… మూర్ఖత్వం అనుకోవాలా…
మీ సెక్యూరిటే అవినీతి ని ప్రోత్సహించారే…
సమాచార శాఖ నకీలీ కార్డు ఇస్తే ..
మీ వ్యక్తిగత సిబ్బంది ఏకంగా కారు పోలీస్ ఐడి కార్డిచ్చారంటే ..
మీ ప్రభుత్వ వైఫల్యం చెందినట్లే గా…
కారులో షికారు చేస్తూ అక్రమాలు చేస్తుంటే ..
అయ్యో నిజమని వెల్డర్ కు సెల్యూట్ కొడుతుంటే…
రేషన్ మిల్లర్ల దగ్గర రాబడికోసం రెచ్చిపోతే…
dso లు కూడా దండాలయ్యా అంటుంటే ..
దండుకోవడానికి మీ వారే దారి చూపించి నట్లేగా. ..
అవినీతి పాలన అన్నావ్… చుట్టూ అవినీతిపరులనే ఎంచుకుంటే. .ఎక్కడ నెరవేరుతుంది నీలక్షం ..
అందుకే నీ ఇంటికే పరిమితం అయ్యావ్…
మీ భద్రతే ప్రమాదంలో ఉంచుకుని ..ప్రజల భద్రతపై ఎన్నో బాటలు వేయాలని కలలు గన్నావ్. .
నీ గన్నే నిన్ను కాల్చలేదు ఎందుకో మరి. .
జగన్మోహనుడా ఇందుకేగా ఓటమి చెందింది..
స్నేహం అంటే కారు ఇప్పించవచ్చు..పోలీస్ ఐడి కూడా ఇస్తారా..?
ఓ నకిలీ గాడికి మీ సెక్యూరిటి ఐడి ఇస్తే..ఆ నకిలీ గాడు ఐడి తో టోల్ గేట్ లలో వాడేసాడట ..
మీరు ఓడిపోయారు… ఐడి కార్డు లాకున్నారట ..
మీరు గెలిచుంటే ఇంకెన్ని నేరాలు జరిగితీరునో..
మీ భద్రతలోనే ఇలా అవినీతి పరులుంటే…
జగన్మోహనుడా మీ ప్రేమకు సలామ్.. ఇలాంటి వారితో ఇన్నాళ్లు క్షేమంగా ఉన్నావంటే ..
ముఖ్యమంత్రి భద్రతా అంటే ఇలా ఉంటుందా…
శభాష్ పోలీస్ బాస్ లారా…
(రామమోహన్ రెడ్డి, సంపాదకులు)
అతి వినయం ధూర్త లక్షణం అన్నారు. అదెంతవరకు నిజమో తెలియదు కాని ఈ కాలంలో కాగడా పట్టుకుని వెదికినా వినయం కనిపించదు. ప్రతి ఒక్కరూ మహారాజే. తప్పనిసరి అయితేనే తలవంచుతారు. ఆ తరవాత బోర విరుచుకుని తిరుగు తారు. మంచి-చెడ్డ, నీతి-న్యాయం, పెద్ద-చిన్న అనే మాటలకు అర్థాలు మారిపోయాయి. కాలానుగుణంగా మార్పులు వస్తాయి, స్వీకరించాలని అందరూ అంటూ ఉంటారు. అదెంతవరకు నిజం?బతుకులో ఒక అయోమయం ఉంది. అయోమయంలో ఒక్కో బతుకు ఉంది. ఈ పరిస్థితి ఇలా కొనసాగితే మానవ సంస్కృతి అటకెక్కిపోతుంది. పురాణాలు కథలుగానైనా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందా? ధర్మాలు శాసనాలకు పరిమితమైపోయి మ్యూజియంలో మగ్గుతుంటాయి. దేవుడు అనే పదానికి అర్థం లేకుండాపోతుంది. ప్రకృతిలో చోటుచేసుకున్న పరిణామమా? విచ్చలవిడితనం దుర్మార్గత్వం జీవనశైలిలో వచ్చిన సహజమైన మార్పులా? కానే కాదు. ఏది సహజమో ఏది అసహజమో తెలుసుకోవాలి. ఏది అపరాధమో, ఏది స్వయంకృతాపరాధమో గ్రహించాలి. గొప్పవాళ్లుగా చాటుకునేవాళ్లు, లేనిపోని గొప్పతనం తెచ్చిపెట్టుకుని సొంత డబ్బా వాయించుకునేవాళ్లు- వినయాన్ని నటిస్తారు. వాళ్లు ఎన్నటికీ శాశ్వతమైన కీర్తిని సంపాదించలేరు. సహజంగా వినయగుణం కలిగినవారు ఎదిగినకొద్దీ ఒదుగుతారు. ఒదిగిన కొద్దీ ప్రకాశిస్తూ ఉంటారు.వానపాముల్లాంటి వాళ్లు కూడా తాచుపాముల్లా ఉందామనుకుంటారు. తాచు పామైనా వానపాములా ఉంటే చంపేస్తారని అందరి భావన. వినయ విధేయతలు లేకుండా పనిచేసే సేవకుణ్ని ఒక యజమాని ఎంతవరకు భరిస్తాడు? అసలెందుకు భరించాలి? బుద్ధిచెప్పి దార్లోకి తీసుకువస్తాడు. లేదంటే ‘నీ కర్మ’ అని వాణ్ని వదిలేస్తాడు. అలాంటి ‘పని’వాడు ఎక్కడున్నా పనిచేసే వాతావరణాన్ని పాడుచేస్తాడు. సరిగ్గా ఇలాగే మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి విషయంలో జరిగిందని చెప్పాలి. ఇంత ఉపోద్ఘాతమ్ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే…ఒక స్వార్ధ పరుడు తన అక్రమ సంపాదన కోసం స్నేహం అనే ముసుగు వేసుకుని చేయరాని చేష్టలు,చేయకూడని పనులు, చట్టం న్యాయం ధర్మం అనేవి కేవలం అక్షరాలు అవి మానవునికి అవసరం నాకు అవసరం లేదన్న ధోరణిలో ప్రవర్తించిన తీరు రాష్ట్ర రాజకీయాల్లోనే ఆచ్చర్యాన్ని కలిగిస్తుందని చెప్పాలి.
ఒక సాధారణ వెల్డర్ తన ప్రక్కన ఉన్న సెల్ పాయింట్ షాపుకు ప్రతినిత్యం వచ్చి అక్కడ కాసేపు ముచ్చటించుకునే మాటలు గమనించి తానొక జర్నలిస్టు గా అవతారమెత్తాడు. జర్నలిస్టుగా అవతార మెత్తి తాను అనుకొన్నదే తడవుగా అతి తక్కువ కాలంలో గొప్ప సంపన్నుడు ఎలా అవ్వాలని ఇతర ఛానెల్స్ పేరు చెప్పి నకిలీ అక్రిడేషన్ పొందాలని చూసాడు.ఇందులో కొంతవరకు సక్సెస్ అయ్యే లోపు ఆ ఛానెల్ వారు కనుగోని ఏదీ చేయాలో అది చేయబోతే పాదాభివందనం చేసి పరుగులు తీసినట్లు చెప్పుకు వస్తున్నారు.బైటికి చెప్పడానికి కొంచెం సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
అది ముగిసింది ఇక ఉర్దూ ఛానెల్ పేరు చెప్పడం మొదలు పెట్టి కొన్నాళ్ళు కాలం గడిపితే అది కూడ మమా అనిపించారు.ఇదంతా వైసీపీ ప్రభుత్వ హయాంలో నే జరిగిన ముచ్చట.ఛీ ఎన్ని చేసినా సంపద కొంతే వస్తుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని చూస్తే లక్ష కోట్లు అంటున్నారు నేను ఒక్క కోటైన జమ చేద్దామంటూ తెలంగాణ మద్యం అక్రమంగా తెచ్చి అమ్మకాలు చేస్తుంటే పోలీసులు అరెస్ట్ చేశారు. సరే నేషనల్ మీడియా పేరుతో బెదిరిద్దామని చూస్తే ఓ రెండో మూడో కేసులు బుక్కై అరెస్ట్ అయ్యి ఆ కేసులు ఎలాగో సరిచేసుకున్నాడు. ఈ తతంగం లో స్నేహితులు వీరోధులు అయ్యారు…అవసరమైతే తన్నే దానికి కూడా వెనుకాడడం లేదు ఒక్కరూ వెంట తోడు రావడం లేదు.ఇక ఇలా అయితే కుదరదు బెజవాడ అయితే బాగుంటుందని ప్లాన్ వేసి తన ప్రాణ స్నేహితుడు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటి లో ఉన్నవ్యక్తి ద్వారా ఇంకొక డూప్లికేట్ ద్వారా నేషనల్ మీడియా అక్రిడేషన్ పొంది అసెంబ్లీ పాసు పొందడం జరిగింది.
ఇక అసలు కథ ఇక్కడ మొదలైంది. ఇంకేముంది అటు నేషనల్ మీడియా అక్రిడేషన్ ఇటు అత్యంత ఉన్నతస్థాయిలో ఉన్న ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది లో ఒకరుగా ఉండటం..కారు చూస్తే తన ప్రాణ స్నేహితుడు పోలీస్ పేరు మీద ఉండటం అన్నీ కలిసి రావడం. అయితే ఇక్కడ ఓ ట్విస్టు ఉంది.ఎంత ప్రాణ స్నేహితుడు అయినా దనమో మాట సహాయమో చేస్తారు. అవసరమైతే ముఖ్యమంత్రి దగ్గర చనువు ఉంటే ఏదో బ్రతుకు దేరువు చూపిస్తారు. కానీ వెల్డర్ ప్రాణస్నేహితుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర ఉన్నానే విచక్షణ,వృత్తి ధర్మం, బాధ్యత తన విధిని కూడా మరిచి అతని పోలీస్ ఐడి కార్డ్ కూడా ఇచ్చినట్లు తెలిసింది.ఇంకేముంది కారు లో ఎక్కడికి షికారు కు వెళ్లినా ఏ టోల్ గేట్ దగ్గర రైట్ రైట్ అనడమే…దీనిని చూసిన వెల్డర్ జర్నలిస్టు తో ట్రావెల్ చేసే సగటు దోపిడి గాళ్లు ఆహా ఓహో అంటూ గొప్పలు చెబుతుంటే ias, ips చదివినవారు, గ్రూప్1,2 అధికారులు ఈ వెల్డర్ జర్నలిస్టుకు రెడ్ కార్పెట్ వేయసాగారు.దీంతో దీపం ఉండగానే ఇళ్ళు చక్కదిద్దుకోవాలని తలచి రాజమండ్రి, భీమవరం, చింతలపూడి ఇలా కొన్ని ప్రాంతాల్లో అనుచర గణాన్ని తయారు చేసుకుని ఉమ్మడి గోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లా లలో నేనే నేషనల్ మీడియా నేను రాసే బుచుకు బుచుకు బ్రేకింగ్ లకు భూమే బద్దలవుతుందని బీరాలు పలుకుతూ అక్రమ రేషన్ వ్యాపారులు, సబ్ రిజిస్ట్రార్, బిల్డింగ్ల దగ్గర అందిన కాడికి దోచుకునే పనిలో ఫుల్ గా బిజీ అయి పోయారు.ఈ లోగా ఈ వెల్డర్ గాడి ఖర్మ కాలి ప్రజాభూమి వాడి చేతికి చిక్కాడు. నాడు చాకిరేవు పత్రిక ఎలా అయితే ఉతికి అరేసిందో నేడు ప్రజాభూమి అలానే చేస్తుంటే ఏదో చేయాలని చూస్తూ ఉన్నాడని సమాచారం.ఇక పోతే వీటికి ఆనాటి ముఖ్యమంత్రి కి ఏమిటి సంబందం అనొచ్చు.ఇందులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాత్ర లేదు ఆనాడు .కానీ ఎన్నో కష్ట సుఖాలు చూసి జైలు జీవితం గడిపి ప్రజా క్షేత్రంలో రాణించిన వాడిగా అందరూ మన వారే కదా అన్న ధర్మాన్ని పాటిస్తే ఆయన్ను ఎంతో ప్రేమగా అభిమానంగా చూసుకుని తప్పు జరగకుండా చూడాల్సిన సమాచార శాఖ తమ సంచులు అవినీతి సొమ్ముతో నింపుకోవటానికి అక్రమ మార్గంలో అక్రిడేషన్ ఇస్తే ఆయన్ను అనుక్షణం అప్రమత్తంగా కాపాడుకోవాల్సిన ఖాకీలు కక్కుర్తి పడి ఇలా తమ ఐడి కార్డు లిచ్చి ఇలా ప్రోత్సహిస్తుంటే భద్రతకు తావెక్కడిది అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతిమంగా నష్ట పోయింది నమ్మిన నాయకుడు. ఇలా ఒకరికి ఒకరు తప్పుడు పనులు చేయడం వల్లే గడిచిన ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యారు. ఇలాంటి అధికారులు తమ స్వార్ధము కోసం ఏదయినా చేయడానికి సిద్ధపడతారని తెలుసుకుని వాస్తవ అవాస్తవాలను విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటే ప్రజాస్వామ్యము ప్రమాదం నుంచి కొంత మేరైన బైట పడుతుందని ఆశించాలి.