ఇదేమి గంధం మాయాజాలం..
సిటీ ప్లానర్ తీరు వేరుగా..
పత్రికా కథనం వస్తే సరెండర్, సస్పెండ్ …
వారు తప్పుచేసారనుకుంటే చర్యలు ఓకే…
అదే బిల్డిండ్ ఇప్పుడెలా స్లాబ్ వేశారో..
ఇదేమి పురపాలక చట్టము రా అయ్యా…
సిటీ ప్లానర్ గారే చూసారు చర్యలు చేపట్టారు
ఇప్పుడున్నది ఆ అధికారే అయినా..
నిర్మాణాలు పూర్తి అయ్యాయి ఎలా ఇది…
ధ్యాన చంద్ర గారు మీరు దృష్టి సారిస్తేనే…
మిమ్మల్ని వేరే ధ్యాసలో ఉంచుతారు…
వీరంతా దండుకొంటుంటే చూస్తూ వదిలేయాలా…
(రామమోహన్ రెడ్డి, సంపాదకులు)
నాలుగు రూపాయల కోసం నమ్ముకున్న న్యాయాన్ని,నమ్మి అప్ప గించిన బాధ్యత లను నట్టేట ముంచి నడి బజారులో నీతిని అమ్ముకుని నీతి మాలిన పనులు చేస్తూనే గడువుతున్న నేటి అధికారులు తీరు చూస్తే నవ్విపొదురు కాక నాకెల సిగ్గు అన్న చందానా ఉంటే ఈ అధికారుల తీరు చూసి అయ్యో తూ అని అంటున్నారు పురపాలక ప్రజలు.ఒక నాడు అక్రమ నిర్మాణాలు అని స్వయంగా పరిశీలించి కింది స్థాయి ఉద్యోగులను బలి చేసిన ఉన్నతాధికారులు నేడు అదే సక్రమని నిర్మాణం పూర్తి చేస్తే ఏమనాలి ఇంకెమనాలో అర్థం కాని పరిస్థితి బెజవాడ కార్పొరేషన్ లో చోటు చేసుకోవడం ఇక్కడి ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యమా అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతుంది.ప్రజల చేత పన్నులు రూపంలో జీతాలు తింటూ ఇలా పనికి మాలిన పనులు చేస్తూ ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని గండికొట్టి జేబులు నిముకుంటూ బ్రతుకుతుంటే ఇంకేమానలి.ఇలాంటి అధికారులను ఇంకేమీ చేయాలో పెద్దలే ఆలోచించాలి మరి. బెజవాడ పట్టణం పోలీస్ కాలనీ లో ఓ నిర్మాణ విషయంలో ఓ పత్రీక కధనం ఆధారంగా ఓ బీల్డింగ్ స్లాబ్ ను కూల్చే విధానం లో రంధ్రాలు వేసిన ఒక అధికారిని సరెండర్ ఇంకొక అధికారిని సస్పెండ్ చేయడం జరిగింది. అదే స్థానంలో టీపీఓ గా గంధం ప్రసాద్ రాగానే స్లాబ్ పూర్తి చేసుకుని హాయిగా పనులు పూర్తి చేశారు.అప్పుడు ఇప్పుడు ఉన్నది అదే సిటీ ప్లానర్ అయితే నాడు ఆ నిర్మాణ విషయం లో వారినెందుకు బలి చేశారు.. నేడెందుకు అవి సక్రమ ము అయ్యాయి అన్నది డాలర్ల ప్రశ్న గా మిగిలి పోతుంది.ఈ అవినీతి అధికారుల ఆగడాలు ఇలానే ఉంటాయా లేక చర్యలు తీసుకుంటారా అన్నది చూడాలి మరి… ఇంకా ఉంది