Thursday, November 28, 2024

Creating liberating content

రాజకీయాలుడైరెక్టర్ గారికి…స్వాగతం…సుస్వాగతం..

డైరెక్టర్ గారికి…స్వాగతం…సుస్వాగతం..

చీడ పట్టిన సమాచార శాఖకు ప్రక్షాళన చేస్తారా…
అవినీతి,అక్రమార్కులకి వెన్నుగా ఉన్నవారి భరతం పడతారా…
నకీలీలకు నకిలీ కార్డులిచ్చిన వారి నడ్డి విరుస్తారా…

  • *లంచాలకోసం లుచ్చా పనులు చేసేవారిపై చర్యలుంటాయా…
    *ఐదు వందల కోసమే అక్రిడేషన్ అన్న దరిద్రాన్ని తొలగిస్తారా…
    *అసలైన జర్నలిస్టుకు అన్యాయం జరగకుండా చూస్తారా…
    *అవినీతి అధికారుల తేనెటీ మాటలకు ఊఅంటారా…ఊహు అంటారా. .
    *సన్మానాలు, సత్కారాలు ముసుగులో మునిగిపోరుగా..
    *ఐఏఎస్ ను అయ్యా ఎస్ చేయరుగా…
    *సొరచాపలముఠాగా మార్చిన సమాచార శాఖ శుభ్రమవుతుందా…
    *సంక్షేమం ముసుగులో సంక్షోభం చేసేవారికి సంకెళ్లు వేస్తారా…
    *కపట నాటకాలతో కళ్ళు గప్పే వారికి కనువిప్పు కలిగిస్తారా…
    *సిఫార్సులతో చంక నెక్కేవారెవరో గుర్తురేగుదురా…
    *జెండా మోస్తూ అజెండాను మరిచే వారిని మట్టుబెడతారా…
    *సంఘాల పేరుతో సన్మానాలు చేస్తే చతికల బడతారా…
    *పొట్టకొస్తే అక్షరంకూడా రాని పకోడీ గాళ్ళను ప్రక్కన బెడతారా…
    *బందరు లడ్డు బడాయి మాటల గారడీలో చిక్కు కోరుగా…
    *వ్యవస్థ కు తిలోదకాలు ఇచ్చే తిమింగాళాలను తరిమికొడతారా…
    *నిబంధనలకు నీళ్లు ఒదిలే అవినీతిపరులుకు అభయం ఇవ్వరుగా…
    *పార్టీ కార్యాలయం నుంచి ప్రభుత్వకార్యాలయంగా మారుస్తారుగా..
  • శుక్లా గారు నకీలీల కు చుక్కలు చూపిస్తారు గా…

  • ( రామమోహన్ రెడ్డి,సంపాదకులు)
    నాలుగు రూపాయల కాసుల కోసం కక్కుర్తిపడి న్యాయాన్ని విస్మరించి సిద్ధాంతాలను వదిలి,తమ ఉద్యోగ ధర్మాన్ని కూడా పక్కన బెట్టి నీచమైన విధానాలకు అలవాటుపడిన సమాచార శాఖ సమస్యల వలయంలో చిక్కుకుని అవినీతి కంపులో మునిగి తెలియాడుతుంది.గత ప్రభుత్వ హయాంలో సమాచార కమిషనర్ గా ఉన్న తుమ్మా విజయకుమార్ రెడ్డి చేసిన తప్పులు అన్ని ఇన్ని కావు.ప్రభుత్వాలు ఒకటే పాలకులు మారుతుంటారన్న సహజ న్యాయాన్ని కూడా విస్మరించి తానే ఒక నియంత లాగా వ్యవహారించి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉండాల్సిన సమాచార శాఖను సంచులు నింపుకొండే శాఖ గా మార్చి తన పబ్బం గడుపుకోవడానిని గబ్బు గబ్బు గా చేసినట్లు అర్థమవుతోంది.
    సమాచార శాఖ అంటేనే ఆది నుండి సమస్యలకు నిలయం గా పేరుంది. తియ్యని మాటలు చెప్పి చప్పట్లు కొడుతుంటే చాలు తేనెటీ విందు ఇచ్చి మరి తప్పుడు పనులు చేయడానికి వెనుకాడని కొంతమంది అవినీతి పరులు ఉండటం వ్యవస్థ దిగజారుడు తనానికి నిదర్శనం గా నిలుస్తున్నాయి. సమాజంలో వ్యవస్థల పట్టు,సామాజిక రాజకీయ అంశాలపై అవగాహన, ప్రజా సమస్యల పట్ల నిశితమైన ఆలోచన ప్రభుత్వాల పట్ల చిత్తశుద్దితో పనిచేసే పాత్రికేయులకు పెద్దపీట వేస్తారు.కానీ ఇదెక్కడి భావ దారిద్య్రమో కానీ ఏదో ఒక పేరుతో పత్రిక పెట్టుకుని నాలుగు తియ్యని మాటలు,కుదిరితే ఓ కప్పుటీ ఇచ్చి సార్ మీరు సూపర్ అబ్బా మీఅంతటి వారు లేరని కొన్ని కారు కూతలు కూసి మీరు నేను ఒకటే కులం మతం అని ఇలా పొగడ్తలు ఉంటే చాలు రాజ్యాంగం రచించిన మహనీయుడు డా అంబేద్కర్ కు తెలియని వక్ర మార్గాన్ని వెతికి మరి చెప్పి నీకింత నాకింత అని వాటాలు పంచుకొనేంత దిగజారి ప్రవర్తించిన తుమ్మా ,ఆయన అనుచర వర్గం చేసిన తప్పుడు పనులు ఒక్కొక్కటిగా బైటికి వస్తున్నాయి.
    ఎవడు జర్నలిస్ట్ ..ఏది జర్నలిజం.. అనే సహజ న్యాయం పనికిరాకుండా పోయింది ఇక్కడ.ఓ ఇంట్లో ఓ వ్యక్తి ఓ సంస్థలో పనిచేస్తే వాడి బందువులు స్నేహితులు అందరూ ఐడి కార్డులు తీసుకుని జర్నలిస్ట్ లు గా చెలామణి అవుతున్నారు. ఓ తండ్రి ఓ ఛానెల్ లో జర్నలిస్ట్ అయితే సిగ్గు ఎగ్గు లేకుండా కొడుకు కూడా జర్నలిస్ట్ గా అక్రిడేషన్ తీసుకుని బస్సులో గాలి తిరుగుడు తిరుగుతుంటే వాడు కూడా జర్నలిస్ట్ అని సమాజం గౌరవించాలి. దేవాలయాల దగ్గర బిక్షగాళ్ల కంటే దిగజారీపోయిన స్థితికి జర్నలిజం తయారు అవుతుంటే వీరికి కొమ్ముకాస్తూ కక్కర్తి పనులకు కాపలాగా ఉంటున్నారు ఈ సమాచార అధికారులు. మరి పెద్ద పెద్ద సంస్థలు అని ఊక దంపుడు ప్రకటనలు చేస్తూ తామే మేధావులమని ఏసీ గదుల్లో కూర్చుని విశ్లేషణలు చేస్తున్న మేధావులకు తమ ముడ్డి కింద ఉన్న అవినీతి కంపు ఎవరు కడగాలి.
    విలువలకు తిలోదకాలు ఇస్తూ సమాజ హితము కోసం కాకుండా తమ స్వార్ధ ప్రయోజనాల కోసం పనిచేసే సంస్థలు, అసంస్థలకు ప్రతినిధులు చేస్తున్న తప్పుడు పనులు ఈ తప్పుడు పనులకి తాళం కొట్టే తప్పుడు అధికారుల తీరుతో వ్యవస్థలు చిన్నా భిన్నామవుతున్నాయి.
    చొక్కాలు మార్చినంత సులువుగా తమ అజెండా లను ఏ రాజకీయపార్టీ అధికారంలో ఉంటే ఆ జెండా భుజానికెత్తుకొని భజన చేస్తే తమ ఉద్యోగం ఎన్ని సంవత్సరాలు అయినా ఏ ప్రమోషన్ వచ్చిన ఎన్ని అక్రమాలు చేసిన ఏ అవినీతి కి పాల్పడ్డ ఏమి కానీ పరిస్థితి ఉంది.అందుకే సంఘాల ముసుగులో సంక్షోభం సృష్టించబడుతున్నా ..కొత్త అధికారులు మంత్రులు వచ్చిన వెంటనే ఓ పూల భోకే,ఓ సాలువ కప్పితే చాలు వారి అవినీతిని ఎలెత్తే దమ్ము లేని పరిస్థితి, ఒక వేళ ఎవడైనా ఎలెత్తి చూపితే వాడిని ఏ రకంగా ఇబ్బంది పెట్టాలో నేర్చుకున్న విష సంస్కృతి ఉన్నంత కాలం వీరి ఆగడాలకు అడ్డు అదుపూ లేకుండా పోతూనే ఉంటుందనేది జగమెరిగిన సత్యం. చూడాలి కొత్త డైరెక్టర్ కొత్తగా మార్పు తెస్తాడా లేక ఇంకేమైనా చేస్తారా అన్నది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article