చలికాలం చలికి పెదాలు పొడిగా మారి, చర్మం చీలి ఒక్కోసారి రక్తం కూడా వస్తుంది. ఆ నొప్పి, మంట భరించలేనిది. పెదాలు పగల కుండా, పగిలినప్పుడు మృదువుగా చేయడానికి కొన్ని చిట్కాలు పాటించాలి. స్నానం చేసిన తర్వాత పెదవులను శుభ్రం చేసి బాదం నూనెను రాసి సున్నితంగా మర్దన చేస్తూ ఉండాలి. దాంతో రోజంతా పెదాలపై తేమ ఉండి పగలకుండా ఉంటాయి.కొబ్బరి నూనెను రోజుకు 2-3 సార్లు పెదవులపై రాయాలి. దీంతో పెదవుల నొప్పి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.పగిలిన పెదవులకు తేనెతో మర్దన చేయడం వల్ల మంట, నొప్పి వెంటనే తగ్గుతుంది.వెన్నలో ఉండే మంచి కొవ్వు పదార్థాలు శరీర గాయాలకు వెంటనే ఉపశమనం కలిగిస్తాయి. ఇందులోని అరాచిడోనిక్ యాసిడ్ పెదాలపై పగుళ్లను ఐదు, ఆరు గంటల్లో తగ్గిస్తాయి. పడుకునే ముందు వెన్న రాసుకుంటే ఉదయాకల్లా పగుళ్లు ఉండవు. కలబంద గుజ్జు రాసినా మంచి ఫలితం ఉంటుంది. రాత్రి పడుకునే ముందు పెదాలకు రాసి పడుకుంటే ఉదయం వరకు పెదాలకు కావాల్సిన తేమ అందుతుంది. కొన్ని దానిమ్మ గింజలను తీసుకొని జ్యూస్ తీయాలి. ఆ జ్యూస్‌ను ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవాలి. రోజూ కొద్ది మొత్తంలో ఆ జ్యూస్‌ను తీసుకొని అందులో కాటన్ బాల్స్ ముంచి వాటితో పెదాలపై సున్నితంగా మర్దన చేయడం వల్ల పగుళ్లు ఏర్పడకుండా ఉంటాయి. చలికాలం ఎక్కువగా దాహం వేయదు. కానీ శరీరానికి కావాల్సినంత నీరు అందించాలి. ప్రతి గంటకు ఓ గ్లాసు నీరు తాగడం మంచిది. అప్పుడు పెదవులు, శరీరం పగలకుండా ఉంటాయి.