శీతాకాలం ప్రారంభమవగానే సీజనల్ వ్యాధులు విజృంభిస్తుంటాయి. అందువల్ల ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఇప్పుడు చెప్పుకోబేయే పదార్థాలకు ఆహారంలో చోటివ్వాలి. రోగనిరోధక శక్తిని పెంచే పసుపు, అల్లం వంటి వాటితో పాటు విటమిన్ సితో నిండిన నారింజలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్లు సమృద్ధిగా ఉండే సీతాఫలాలు శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి.పొటాషియం, మెగ్నీషియంతో నిండిన అరటి పండ్లు శరీరానికి శక్తిని ఇస్తాయి.యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు సమృద్ధిగా ఉండే ద్రాక్ష శరీరాన్ని హైడ్రేట్ చేస్తాయి.విటమిన్ ఎతో నిండిన క్యారెట్లు కళ్ళకు మంచివి.పిండి పదార్థాలు, విటమిన్లు సమృద్ధిగా ఉండే చిలకడదుంపలు శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి.పోషకాలు, పీచు పదార్థాలతో నిండిన రాగులు జీర్ణక్రియకు మంచివి.ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లతో నిండిన బాదం గుండె ఆరోగ్యానికి మంచివి.కాల్షియం, విటమిన్ డితో నిండిన పాలు ఎముకల ఆరోగ్యానికి మంచివి.
You are my inspiration , I have few blogs and often run out from to post : (.