Thursday, November 28, 2024

Creating liberating content

తాజా వార్తలుప్రతి ఇంటికీ వచ్చా.. ప్రతి సమస్యతెలుసుకున్నా… ...

ప్రతి ఇంటికీ వచ్చా.. ప్రతి సమస్యతెలుసుకున్నా… ప్రజా సమస్య పరిష్కరించే బాధ్యత నాదే

ఉమ్మడి అభ్యర్థిని యనమల దివ్య

తుని :టీడీపీ బీజేపీ,జనసేన ఉమ్మడి అభ్యర్ధి యనమల దివ్య.మీ ఇంటింటికి మీ దివ్య కార్యక్రమం ద్వారా ప్రజా విశ్వాసం, నమ్మకం మూటగట్టుకున్న యనమల దివ్య తండ్రికి తగ్గ తనయురాలు‌గా అందరూ ఆప్యాయతతో మన ఇంటి ఆడపడుచుగా పిలుచు
కుంటున్న యనమల దివ్య ..గెలుపు కోసం స్వగృహ ప్రవేశాలు,పార్టీలో చేరికలూ ఓవైపు…మరో వైపు ఆత్మీయ సమావేశాలు…ఇలా అభిమాన నేత్రి యనమల దివ్య పట్టాభిషేకానికి జోరుగా హూ‌షారుగా సాగుతున్నాయి.ఈనేపధ్యంలో ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరిన ఆర్యవైశ్య ప్రముఖుడు నార్ల రత్నాజీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం జరిగింది. మున్సిపల్ మాజీ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో
సభ్యుడు యనమల రామకృష్ణుడు, తెలుగుదేశం బిజెపి జనసేన ఉమ్మడి అభ్యర్థి యనమల దివ్య హాజరయ్యారు.
తొలుత ఆంజనేయస్వామి టెంపుల్ వద్ద యనమల రామకృష్ణుడు యనమల దివ్య కు ఘన స్వాగతం లభించింది. అక్కడ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేసిన తర్వాత భారీ ర్యాలీగా కన్యకా పరమేశ్వరి ఆలయానికి చేరుకున్నారు. అక్కడ వేద పండితులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన ఆత్మీయ సభలో ప్రసంగించిన యనమల రామకృష్ణుడు తన హయాంలో తుని పట్టణ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా అనేక శాశ్వత కార్యక్రమాలు చేశామన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని సహజ వనరులు, ప్రజల సొమ్ములను దోపిడీ‌‌ చేస్తున్న వైకాపా నేతలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలి అన్నారు. ప్రజల ఆర్థిక పురోభివృద్ధికి కృషి చేయవలసిన పాలకపక్షం, తమ ఆస్తులను పెంచుకునేందుకే పరిమితమయ్యారన్నారు. ఉమ్మడి అభ్యర్థి యనమల దివ్య మాట్లాడుతూ ప్రతి గడపకు వచ్చా ప్రతి సమస్య తెలుసుకున్నా…. మీ సమస్యలను పరిష్కరించి తండ్రికి తగ్గ తనయురాలుగా పేరు తెచ్చుకుంటానని అన్నారు. యనమల సమక్షంలో కౌన్సిలర్
నార్ల భువన సుందరి, గ్రంధి కామేశ్వరరావు, నార్ల రాజా, నార్ల రమేష్, మామిడి శ్రీధర్, కడిమిశెట్టి రాజు, పి రాంబాబు, చల్లకొండ చిట్టి కుమారి, యు సీత, వై నాగలక్ష్మి, వై దేవి, కే దేవి ‌ తదితరులు తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి పార్టీ కండువాలు కప్పిన యనమల రామకృష్ణుడు తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త చోడిశెట్టి గణేష్, తటవర్తి రాజా, కుక్కడకు బాలాజీ, వెలగా రంగనాయకులు, వెలగా వెంకట కృష్ణారావు సీనియర్ నాయకులు ఎస్ఎల్ రాజు, మోతుకూరి వెంకటేష్, యనమల శివరామకృష్ణ,యనమల రాజేష్, చింతంనీడి అబ్బాయి, టౌన్ నాయకులు మళ్ళ గణేష్, దంతులూరి శ్రీనివాసరాజు, అల్లు రాజు, మామిడి దాసు, పూడి అప్పారావు,పూడి సత్యవేణి తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article