కోటనందూరు
కోటనందూరు తమ్ముళ్ల
పోల్ మేనేజ్మెంట్ సూపర్.ఆ ఊరూ,ఈఊరూ చెప్పనక్కర్లేదు.ఏడాది నుంచి తమ్ముళ్ళ వీరోచితం.. అజరామరం.పార్టీకి పూర్వ వైభవం
తీసుకుని రావాలన్న కసి,పట్టుదల ప్రతి ఒక్కరిలో కనిపించింది.వరస
ఓటముల నుంచి బయటపడి పసుపు జెండా రెపరెపలాడించాలన్న ఉత్సాహం సమిష్టి కృషి వైపు నడిపించించింది.
మండల టిడిపి అధ్యక్షుడు గాడి రాజబాబు సారథ్యంలో పార్టీ యంత్రాంగం ప్రచార పర్వం నుంచి లగాయితూ పోల్ మేనేజ్మెంట్ వరకు
సక్సెస్ అయింది.పెంటకోట భాస్కర
సత్యనారాయణ, దంతులూరి చిరంజీవి రాజు, అంకం రెడ్డి రమేష్,బంటు పల్లి వెంకటేశ్వరరావు,పోతల సూరిబాబు,బోడపాటి సత్యనారాయణ ,పెన్ముత్స నాగేశ్వరరావు,వెలగా వెంకట కృష్ణారావు వంటి సీనియర్ నేతలు క్షేత్రస్ధాయి శ్రేణులను సమన్వయ పరిచి పని చేయడంతో తెలుగుదేశం పార్టీ మంచి ఫలితాలను సాధించడంతోంది.అదేవిధంగా జనసైనికుల బలం కూడా తోడయింది. వైసీపీ కోటనందూరు,అల్లి పూడి పంచాయితీలపై గట్టి నమ్మకం పెట్టుకుంది.తీరా సీన్ రివర్స్ అయిందని టిడిపి శ్రేణులు అంటున్నాయి.ఈ రెండింటిలోనూ
తామే ముందంజలో ఉంటామని,కేపీ చిన్నయ్య పాలెం,కేవో అగ్రహారం,కేఏ మల్లవరం,పాత కొట్టాం, బొద్దవరం, భీమవరపుకోట పంచాయితీలపై టీడీపీ పట్టు సాధించింది.ఇక కొత్త కొట్టాం, కాకరాపల్లి,సూరపురాజుపేట పంచాయితీల్లో కూడా డెఫినెట్ గా
తామే ఎడ్జ్ లో ఉంటామని కూటమి నేతలు అంటున్నారు .ఎంత లేదన్నా
2వేలు మెజార్టీ సాధిస్తామన్న గట్టి
నమ్మకం టీడీపీలో కనబడుతుంది