Thursday, November 28, 2024

Creating liberating content

క్రీడలు16 ఏళ్ల కిందటి సెహ్వాగ్ రికార్డు బ్రేక్ చేసిన యశస్వి.. 5 టెస్టుల్లోనే ఈ ఘనత

16 ఏళ్ల కిందటి సెహ్వాగ్ రికార్డు బ్రేక్ చేసిన యశస్వి.. 5 టెస్టుల్లోనే ఈ ఘనత

టెస్ట్ క్రికెట్ లో యశస్వి జైస్వాల్ తన టాప్ ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఇంగ్లండ్ తో జరుగుతున్న నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లోనూ అతడు హాఫ్ సెంచరీ చేశాడు. ఈ సిరీస్ లో ఇప్పటికే రెండు డబుల్ సెంచరీలు చేసిన యశస్వి.. ఈ క్రమంలో టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 16 ఏళ్ల కిందట నెలకొల్పిన ఓ రికార్డును సునాయాసంగా బ్రేక్ చేశాడు.టెస్ట్ క్రికెట్ లోనూ విధ్వంసం సృష్టించే బ్యాటర్ గా వీరేంద్ర సెహ్వాగ్ కు పేరుంది. అలాంటి డాషింగ్ ఓపెనర్ రికార్డును కూడా యశస్వి చాలా సింపుల్ గా బ్రేక్ చేసేశాడు. 16 ఏళ్ల కిందట అంటే 2008లో ఇండియా తరఫున ఒకే కేలండర్ ఏడాదిలో టెస్టుల్లో అత్యధిక సిక్స్ లు బాదిన రికార్డును సెహ్వాగ్ క్రియేట్ చేశాడు. ఆ ఏడాది సెహ్వాగ్ 14 టెస్టుల్లో 22 సిక్స్ లు బాదాడు.
కానీ తాజాగా 2024లో యశస్వి జైస్వాల్ మాత్రం తాను ఆడుతున్న ఐదో టెస్టులోనే 23వ సిక్స్ బాది సెహ్వాగ్ రికార్డును బ్రేక్ చేశాడు. వీరూకి 14 టెస్టులు, 27 ఇన్నింగ్స్ అవసరం కాగా.. యశస్వి మాత్రం ఈ ఏడాది కేవలం ఐదో టెస్టులోనే ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇక మూడో స్థానంలో రిషబ్ పంత్ 21 సిక్స్ లతో ఉన్నాడు. పంత్ 2022లో ఈ రికార్డు క్రియేట్ చేశాడు.తర్వాతి స్థానాల్లో రోహిత్ శర్మ (19 సిక్స్ లు, 2019), మయాంక్ అగర్వాల్ (18 సిక్స్ లు, 2019) ఉన్నారు. తాజా ఇన్నింగ్స్ లో యశస్వి.. 117 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్స్ తో 73 రన్స్ చేశాడు. షోయబ్ బషీర్ బౌలింగ్ లో లాంగాన్ మీదుగా కొట్టిన సిక్స్ తో యశస్వి ఈ రికార్డు క్రియేట్ చేశాడు.
టెస్టు చరిత్రలో అత్యధిక సిక్సర్లు నమోదైన సిరీస్‌లు
74 సిక్సర్లు – భారత్ వర్సెస్ ఇంగ్లండ్ (2024)
74 సిక్సర్లు – ఇంగ్లండ్ వర్సెస్ ఆస్ట్రేలియా (2023)
65 సిక్సర్లు – ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్ (2013/14)
65 సిక్సర్లు – భారత్ వర్సెస్ సౌతాఫ్రికా (2019)
59 సిక్సర్లు – పాకిస్థాన్ వర్సెస్ న్యూజిలాండ్ (2014).

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article