Thursday, November 28, 2024

Creating liberating content

రాజకీయాలుఔను వాళ్లిద్దరూ ఇష్టపడితే…?

ఔను వాళ్లిద్దరూ ఇష్టపడితే…?

రాజన్న బిడ్డలు రాజీపడినట్లేనా..
అన్నా చెల్లెల్లు ఒక్కటైతే…
అధికార పార్టీకి అవరోధాలు తప్పవా..
నాడెందుకు నో .. నేడెందుకు ఎస్ అంటున్నారు…
జగన్ జైలుకు పోవాల్సివస్తే..
చెల్లి షర్మిల పార్టీ చక్కబెడుతుందా..?
తల్లి పిల్ల కాంగ్రెస్ ఒక్కటవుతారా…
బెంగుళూరు ఫ్యాలెస్ భేషజాలు పోగొట్టినట్లేనా
ఫ్యాన్ కు హస్తం అభయ హస్తం ఇస్తే…
జగన్ ప్రభంజనం సృష్టిస్తాడా
స్థానిక ఎన్నికల్లో కూటమికి కష్టమవుతుందా..
ఏ కూటమితో ప్రజలు జతకడతారు

(రామమోహన్ రెడ్డి,సంపాదకులు)
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు కానీ శాశ్వత మిత్రులు కానీ ఉండరనేది లోకోక్తి.ఇక్కడ రాష్ట్ర రాజకీయాల్లో సరిగ్గా అదే జరుగబోతుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సరిగ్గా పదేళ్ల క్రితం తన అన్న పార్టీని తన బుజ స్కందాలపై వేసుకుని నడిపించింది. పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజ నింపడానికి పాదయాత్ర చేసింది.ప్రజల్లో నాన్న ఆశయాలను సాధించడానికి సహకారం కావాలని పోరాటం చేసింది. పలితం కొంత మేర మాత్రమే సాధించినట్లు అయింది.

ఆ తరువాత 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క అవకాశం ఇస్తే రాజన్న రాజ్యం తెస్తామని ప్రజల్లోకి వచ్చారు.ప్రజలు ఏ రాజ్యం తెస్తారో చూద్దామని అవకాశం ఇచ్చారు.కానీ అధికారం వచ్చి అన్న ప్రభుత్వాధినేత అవ్వగానే ఆత్మీయ సోదరి అడ్రెస్ లేకుండా పోవడంతో ఛీ ఛీ పుట్టినిల్లు కాదు అత్తింటిని చక్క దిద్దాలి అని హైదరాబాద్ మకాం మార్చి అక్కడ ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉంటే అక్కడ తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని పార్టీని స్థాపించి అడుగులు ముందుకు వేసింది వైఎస్ షర్మిల. ఏపీలో రాజన్న రాజ్యానికి అడుగులు పడ్డాయని తెలంగాణ లో రాజన్న రాజ్యం స్థాపించాలని తపన పడి తడబాటు పడి తిరిగి కాంగ్రెస్ పార్టీలో రాజన్న ను విలీనం చేసింది.అక్కడ అధికారంలోకి రావడానికి అన్ని ఏర్పాటు చేసుకున్న రేవంత్ అన్న ఇక్కడ రాజన్న రాజ్యం తెస్తా ఏపీలో రాజన్న రాజ్యం లేదని ఆంధ్రకు ఇంచార్జ్ గా అన్న వదిలిన బాణాన్ని అన్నమీదకే వదిలింది కాంగ్రెస్ హైకమాండ్. ఏపీలో కాలుపెట్టి అన్న జగనన్నపై యుద్ధమే మొదలు పెట్టి బాబాయ్ హత్య దగ్గర నుంచి పాలన తీరుపై పోరాటం చేస్తూ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ అనుకున్నట్లే అన్నను అధః పాతాళానికి తొక్కడానికి ఎంతో కొంత సహాయపడింది. అందరూ అనుకున్నట్టే జగనన్న వదిలిన బాణం ఆయనకే తగిలిందని భావించారు.ఆ తరువాత కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చింది.నాడు చేసిన కుట్రలు ఒక్కొక్కటిగా బైటికి లాగుతూ ఒక్కొక్కరిగా కటకటాల పాలు అవుతుంటే ఫ్యాన్ కు ఉక్కపోత ఎక్కువై పార్టీలో నేతల కొనసాగింపు తక్కువై కూటమిలో కి పరుగులు తీస్తుంటే కార్యకర్తలలో ఆత్మస్థైర్యం దెబ్బతింటుంటే అధినేత జగన్ అభయం ఇస్తున్నా అది కొంతమేర వరకే పనికివస్తుంది. జాతీయ స్థాయిలో మోడీ అండ దండలు వుంటాయాని భావించిన కూటమి నేత నారా లోకేష్ ఢిల్లీ పర్యటనలతో అక్కడకూడా ఫ్యాన్ కు ఉక్క పోత ఎదురైనట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సరే జాతీయ స్థాయిలో జతకడతాము అంటే ఇండియా కూటమి ఉంది.రోజు రోజుకు రాష్ట్రంలో అరెస్ట్ ల పర్వం కొనసాగుతుంటే ఎప్పుడు ఎవరు ఏ కేసులో అరెస్ట్ అవుతారో అని ఉక్కిరిబిక్కిరి అవుతుంటే అన్న ఆలోచన మార్చినట్లు తెలుస్తొంది.తాను వదిలిన బాణం తనకు గుచుకునే విదంగా చేసుకున్న పొరపాట్లను సవరించుకుని ఇంకొక సారి అదే బాణం మళ్ళీ గుచ్చుకోకుండా కాంగ్రెస్ పార్టీతో జత కట్టి ఎన్డీఏ కూటమి కి వ్యతిరేకంగా ఇండియా కూటమి తో మైత్రి చేసుకుంటే కటకటాల పాలు అయినా పార్టీ ని చెల్లి షర్మిల మళ్లీ నడిపిస్తుందనే భరోస కలిగిన జగనన్న బెంగుళూరు ఫ్యాలెస్ లో చర్చలు జరిపినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు గడుస్తున్నా సూపర్ సిక్స్ పథకాలు చేపట్టడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉండటంతో కాంగ్రెస్ తో జతకట్టి కొంత బలం చేకూర్చే కుంటే రాబోవు స్థానిక సంస్థలలో గతంలో మాదిరిగా వైసీపీ బలం పుంజుకునే అవకాశాలు దక్కించుకుంటూ తద్వారా వచ్చే సార్వత్రిక ఎన్నుకల్లో విజయం సాధించడం సులభంగా ఉంటుందనే ఆలోచన లో ఉన్నట్లు తెలుస్తుంది.దీనికోసం కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో రహస్య మంతనాలు చేస్తున్న ట్లు వినికిడి వస్తుంది.జగన్ కాంగ్రెస్ తో జతకడతారా లేదా ఒంటరిగానే పోరాటం చేస్తాడా అన్నది వేచిచూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article