ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుటుంబ సభ్యులు వివాహ వేడుకల్లో మునిగిపోయారు. షర్మిల తనయుడు వైఎస్ రాజారెడ్డి వివాహం ప్రియా అట్లూరితో రాజస్థాన్ లోని జోథ్ పూర్ లో గ్రాండ్ గా జరిగింది.
రాజారెడ్డి ప్రేమించిన ప్రియా అట్లూరితో వివాహాన్ని జోథ్ పూర్ లోని కోటలో అత్యద్బుతంగా జరిపించారు ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు.
క్రైస్తవ సంప్రదాయ పద్దతిలో ఇద్దరితో దైవప్రమాణం చేయించిన తర్వాత వివాహ మహోత్సవాన్ని నిర్వహించారు.జోథ్ పూర్ లోని ఉమేద్ ప్యాలేస్ లో రాజారెడ్డి వివాహ వేడుకలు శనివారం అనగా ఫిబ్రవరి 17వ తేదిన గ్రాండ్ గా జరిగింది. ఫ్లవర్స్ డెకరేషన్ మధ్యలోంచి వరుడు రాజారెడ్డిని అతని తల్లిదండ్రులు బ్రదర్ అనీల్ కుమార్, వైఎస్ షర్మిల వెంటతీసుకొొని వచ్చారు.
పెళ్లి వేడుకలకు వైఎస్ షర్మిల కుటుంబ సభ్యులతో పాటు తల్లి విజయమ్మ మాత్రమే హాజరయ్యారు. సోదరుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్ దూరంగా ఉన్నారు.
వైఎస్ షర్మిల కుమారుడి వివాహ వేడుకలు జోథ్ పూర్ లో ఈనెల 16వ తేది నుంచి మొదలయ్యాయి. 16న మంగళస్నానాల వేడుక(హల్దీ)ను కూడా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు.