ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్న ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి వైసీపీపై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడున్నది YSR కాంగ్రెస్ పార్టీ కాదని… Y అంటే YV సుబ్బారెడ్డి అని… S అంటే సాయిరెడ్డి…R అంటే రామకృష్ణా రెడ్డి… అన్నారు. ఆ పార్టీలో వైఎస్ఆర్ లేరని … మీది జగన్ రెడ్డి పార్టీ..నియంత పార్టీ…ప్రజలను పట్టించుకోని పార్టీ అంటు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ ఆశయాలను నిలబెట్టనీ పార్టీ… ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టే పార్టీ… అన్నారు.
నాపై ముప్పేట దాడి చేస్తున్నారు… నా బిడ్డలను, ఇంటిని పక్కన పెట్టి నా సొంత వాళ్ళు అనుకొని 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేశా..YSR కాంగ్రెస్ పార్టీని నా బుజాల మీద వేసుకుని… మనసు పెట్టి పని చేశా..నా రక్తం ..నా చెమటను దారపోశా… అదే YSR కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నా మీద దాడి చేస్తుందని షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు. ఇంకా ఆమె ఏమన్నారంటే…నా మీద ఎన్ని రకాలుగా దాడులు చేసిన నేను భయపడనని… ఇక్కడ ఉన్నది వైఎస్సార్ బిడ్డ అని… భయపడే వాళ్ళు ఎవరు లేరని హెచ్చరించారు. మీకు చేతనైంది చేసుకోండన్నారు.