అంజీర లేదా అత్తి పండ్లులో విటమిన్ ఎ, బి, సి, కెతో పాటు కార్బోహైడ్రేట్లు, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం మొదలైనవి ఉంటాయి. అంజీర పండ్లలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది, ఇది రక్తహీనతను నివారిస్తుంది. శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. అంజీర్ పండ్లతో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.అంజీర్ లేదా అత్తి పండ్లు రక్తపోటు, వృద్ధాప్యాన్ని నియంత్రిస్తాయి.అంజీర్ పునరుత్పత్తి వ్యవస్థను అదుపులో ఉంచుతుంది. మూత్రపిండాల్లో రాళ్లను నివారిస్తుంది.బరువు నిర్వహణలో సహాయపడుతాయి.గుండె ఆరోగ్యానికి మేలు చేసే ఆరోగ్యకరమైన ఆహారం ఇది.అంజీర్ క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.