Thursday, November 28, 2024

Creating liberating content

హెల్త్అటుకులు(పోహా) అల్పాహారంగా తీసుకుంటే …

అటుకులు(పోహా) అల్పాహారంగా తీసుకుంటే …

రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం మంచి ఆహారం తీసుకోవాలి. అందులో భాగంగా అటుకులును బ్రేక్ ఫాస్ట్‌గా తీసుకోండి. అటుకులును పోహా అని కూడా అంటారు. రోజంతా ఉత్సాహంగా ఉండటమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. అటుకులను దక్షిణ భారతదేశంలోనూ చాలా మంది చేసుకుని తింటారు. దీని నుంచి కలిగే ఉపయోగాలను చూద్దాం..
బరువు తగ్గాలని ప్రయత్నించే, ఆరోగ్య స్పృహ ఉన్న వ్యక్తులు అటుకులను తినొచ్చు. ఇది తింటే కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. అనవసరమైన ఆహారాన్ని తినకుండా నిరోధించవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలికి సహాయపడుతుంది. కొద్దిగా నిమ్మరసం, పచ్చిమిర్చి కలిపి తీసుకుంటే అటుకుల రుచి అమోఘం. పోహా సులభంగా జీర్ణమవుతుంది. ఇది తింటే మిగతా రోజంతా ఎప్పుడూ కడుపు ఉబ్బరం అనిపించదు. అనవసరమైన ఆహారం తినాలని అనిపించదు. అల్పాహారంలో పోహా తీసుకోవడం మంచి ఎంపిక.
అల్పాహారంలో తినే ఆహారం లంచ్ సమయం వరకు ఇంధనాన్ని అందించేలా ఉండాలి. పోహా ఈ అవసరాలను తీరుస్తుంది. ఎందుకంటే ఇది మధ్యాహ్న భోజనం వరకు శక్తి కొరత లేకుండా చేస్తుంది. అన్ని కార్యకలాపాలకు అవసరమైన శక్తిని దీని ద్వారా పొందవచ్చు. శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉండగలుగుతారు.
పోహాలో మంచి ఐరన్ కంటెంట్ ఉంటుంది. అంటే అల్పాహారంగా తినేవారికి ఎప్పటికీ రక్తహీనత రాదు. ఐరన్ ఎక్కువగా అవసరమయ్యే గర్భిణులు, చిన్న పిల్లలకు ఇది మంచి అల్పాహారం. ఐరన్ మన రక్తంలో హిమోగ్లోబిన్ కంటెంట్‌ను అవసరమైన స్థాయిలో నిర్వహించడానికి అవసరమైన మూలకం. పోహాతో ఐరన్ లభిస్తుంది.మీ శరీరంలో కార్బోహైడ్రేట్ అవసరాల కోసం పోహాపై ఆధారపడవచ్చు. కార్బోహైడ్రేట్ల ఆహారాల జాబితాలో పోహా మొదటి స్థానంలో ఉంది. రోజువారీ శారీరక కార్యకలాపాలకు కార్బోహైడ్రేట్లు చాలా అవసరం. పోహాలో కరగని ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మరింత ఆరోగ్యకరమైన ఆహారంగా మారుతుంది.
పోహాలో కొన్ని కూరగాయలు కలిపితే పోషకాలు మరింత బలాన్నిస్తాయి. వేరుశెనగ లేదా మొలకెత్తిన గింజలతో చేసుకోవచ్చు. ప్రొటీన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. కొంతమంది ప్రోటీన్ కోసం పోహాలో గుడ్లు కూడా కలుపుతారు.పోహాలో విటమిన్ బి1 పుష్కలంగా దొరుకుతుంది. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచి అల్పాహారం. ఈ విటమిన్ మధుమేహ వ్యాధిగ్రస్తులలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
పోహాలో మంచి ప్రొటీన్లు ఉంటాయి. కండరాల పెరుగుదలకు లేదా గాయపడిన కండరాల మరమ్మత్తు, బలోపేతం చేయడానికి ప్రోటీన్లు అవసరం. వ్యాయామం తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత తీసుకునే ఆహారంగా పోహా ఉత్తమ ఎంపిక.పోహాను పెరుగుతో కలిపి తీసుకుంటే మన ఎముకలు క్యాల్షియం మొత్తాన్ని గ్రహిస్తాయి. ఎముకలు, దంతాలు బలంగా, ఆరోగ్యంగా ఉంటాయి. అందుకే అల్పాహారంలోకి పోహాను చేర్చుకోండి. ప్రయోజనాలు పొందండి.
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం బరువు తగ్గడానికి ప్రయత్నించే వారికి పోహా ఆహారం సరైనది. అల్పాహారం కోసం తీసుకోవడం వల్ల లంచ్ సమయం వరకు నిండుగా ఉండేలా చేస్తుంది. ఎలాంటి అనారోగ్యకరమైన రెడీమేడ్ ఫుడ్ తినకుండా ఉండొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article