Thursday, November 28, 2024

Creating liberating content

తాజా వార్తలుఅనుపల్లి పంచాయితీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్..!

అనుపల్లి పంచాయితీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్..!

–సైకిల్ ఎక్కిన 100 వైసీపీ సానుభూతి కుటుంబాలు..

–అందరికీఅండగాఉంటానని పులివర్తి నాని భరోసా..

–రహదారిలోని గుంతలకు నాలుగున్నర సంవత్సరం తరువాత ప్యాచ్ వర్క్ లు..
రామచంద్రాపురం:రామచంద్రాపురం మండలం, అనుపల్లి పంచాయితీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కి భారీ షాక్ తగిలింది. సీనియర్ వైసీపీ నేత, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు తాతిరెడ్డి వెంకటేష్ రెడ్డి పార్టీని వీడారు. ఆదివారం ఆయన అనుచరులు, 100 వైసీపీ సానుభూతి కుటుంబాలు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని ఆధ్వర్యంలో పసుపు కండువాలు కప్పుకున్నారు. పులివర్తి నాని వారిని పార్టీలో ఆహ్వానించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, గ్రామ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ రఫీ మృతికి రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం
బహిరంగ సభలో పులివర్తి నాని ప్రసంగించారు. 2018లో జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తుండగా ఇదే ప్రాంతంలో డికేటి భూములకు పట్టాలు మంజూరు చేయిస్తానని హామి ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. సిఎం జగన్ కు అత్యంత సన్నిహితుడు అని చెప్పుకుంటున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని హామీ ఏమైందని ప్రశ్నించారు. 10 ఏళ్లుగా అధికారంలో ఉండి రాయలచెరువు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపలేక పోయారని విమర్శించారు. నాలుగు పదవులు అడ్డం పెట్టుకొని అడ్డదిడ్డంగా సంపాదించుకున్నారే ఏ ఒక్క సమస్యకు పరిష్కారం చూపలేదని మండిపడ్డారు. అనుపల్లి, రామచంద్రాపురం, తిరుపతి రహదారి గోతులు ఏర్పడి అధ్వాన్నంగా ఉన్నా పట్టించుకోకపోవడం ఏమిటని ప్రశ్నించారు. నాలుగున్నర సంవత్సరాల తరువాత రహదారిలోని గుంతలకు ప్యాచ్ వర్క్ ఎన్నికలకు ముందు రహదారులు గుర్తుకు వచ్చాయా అంటూ పులివర్తి నాని ప్రశ్నించారు. నాపై నమ్మకంతో తెలుగుదేశం పార్టీ లో చేరుతున్న ప్రతి ఒక్కరికి అలాగే నియోజకవర్గం అభివృద్ధికి చిత్తశుద్ధితో పని చేస్తానని పులివర్తి నాని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article