పులివెందుల టౌన్
రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం టిడిపి తోనే సాధ్యమని పులివెందుల నియోజకవర్గం ఇంచార్జ్ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి (బిటెక్ రవి) అన్నారు. బుధవారం పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో బాకరాపురం లో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ బీటెక్ రవితో అడుగేద్దాం కార్యక్రమంలో భాగంగా బీటెక్ రవి ఆయన సతీమణి లతా రెడ్డి లు టీడీపీ -జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టోలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి కాలనీలలో ఇంటింటికి తిరిగి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకాపా పాలనలో అవినీతి,దౌర్జన్యం, అక్రమాలు తప్ప అభివృద్ధి శూన్యం అన్నారు. రాష్ట్రం బాగుపడాలంటే ఒక చంద్రబాబునాయుడు తోనే సాధ్యమన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కుటుంబ సభ్యులు చీదరించుకుంటున్నారని, కుటుంబ సమస్యలను పట్టించుకోని జగన్ రాష్ట్రంలోని ప్రజల సమస్యలను ఏం పట్టించుకుంటాడు అని అయన ఆన్నారు. రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని ఆయన ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మండల ఇంచార్జిలు ,పులివెందుల మున్సిపాలిటీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.