గాజువాక:గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ కు ప్రజల నుంచి ఆదరణ పెరుగుతోంది. స్థానిక డ్రైవర్స్ కాలనీలో శుక్రవారం ఎన్నికల ప్రచారానికి వెళ్లిన మంత్రి అమర్నాథ్కు భారీగా స్వాగతం పలకడానికి వచ్చిన జనమే ఇందుకు నిదర్శనం. స్థానిక డ్రైవర్స్ కాలనీ, ఎర్రగడ్డ కాలనీ, శ్రామిక నగర్ ప్రాంతాలలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. అవ్వ, తాత చిన్న, పెద్ద అందరూ అమర్నాథ్కు ఎదిరేగి హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూస్తే ఈ ప్రాంతంలో వైఎస్ఆర్సిపి భారీ మెజార్టీని సాధిస్తున్న నమ్మకం కలుగుతోంది. ఈ సందర్భంగా మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ, ప్రజలలో పార్టీ పట్ల విశ్వాసం రెట్టింపు అయిందని, ఏ రాష్ట్రంలోని లేనివిధంగా సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క కుటుంబానికి అందడం దీనికి కారణం అని అన్నారు. ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో తాను విజయం సాధిస్తానన్న పూర్తి నమ్మకం కలుగుతుందని అమర్నాథ్ చెప్పారు. కూటమి పార్టీలకు ప్రజలకు చేసింది చెప్పడానికి ఏమీ లేకుండా పోయిందని, ఆ పార్టీలను జనం పక్కన పెట్టేసారని అమర్నాథ్ వ్యాఖ్యానించారు. కార్యకర్తలు, నాయకులు ఓటర్లకు మరింత చేరువై ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్న తీరును వారికి వివరించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఊరుకుటీ రామ చంద్ర రావు రాష్ట్ర కార్యదర్శి ఊరుకుటి అప్పారావు,K శ్రీనివాస్ ,పూర్ణ,రెడ్డి జగన్నాధం, ప్రమీల నర్సింహా రావు,పల్గట్ కృష్ణ, కార్పొరేటర్ ఇమ్రాన్,మార్కెట్ యార్డ్ డైరెక్టర్ ఎరోతి గణేష్ తదితరులు పాల్గొన్నారు.