Thursday, November 28, 2024

Creating liberating content

తాజా వార్తలుఅర్జునుడు ఆడవాళ్లను రక్షించాడే తప్ప, తూలనాడలేదు

అర్జునుడు ఆడవాళ్లను రక్షించాడే తప్ప, తూలనాడలేదు

మేం కౌరవులం.. ఆయనేమో అర్జునుడట , ముందు ఇది కలియుగం
సొంత చెల్లెల్ని తిట్టేవారిని ప్రోత్సహిస్తున్న
జగన్ అర్జునుడా?: పవన్ కల్యాణ్

జనసేనలోకి ఎంపీ బాలశౌరి

మంగళగిరి:-
మంచితనానికి మారుపేరు, నిజాయతీకి నిలువెత్తు నిదర్శనం లాంటి జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర పాలన సాగుతోందని ఎద్దేవా చేశారు. “వారి బాధ నిన్న వర్ణనాతీతం. ఆయన చాలా బాధపడిపోతున్నారు. ఆయనను అందరూ ఇబ్బంది పెట్టేస్తున్నట్టు, ఆయనొక అర్జునుడులాగా, మేమందరం కౌరవుల్లాగా, ప్రజలే ఆయన ఆయుధాలు అని, ప్రజలే ఆయనకు శ్రీకృష్ణుడు అని మాట్లాడుతోంటే చాలా అసహ్యంగా ఉంటోంది. అర్జునుడు ఆడవాళ్లను రక్షించాడే తప్ప, తూలనాడలేదు. జగన్ తనను తాను అర్జునుడితో పోల్చుకోవడం హాస్యాస్పదంగా ఉంది. సొంత చెల్లెలు షర్మిల గారిని అత్యంత నీచంగా మాట్లాడుతూ ఉంటే, అలా తిట్టేవారిని ఎంకరేజ్ చేసే వ్యక్తి అతను. అతను అర్జునుడుతో పోల్చుకుంటున్నాడు. తోడబుట్టిన చెల్లెలికి గౌరవం ఇవ్వని వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. సొంత బాబాయ్ ని నిర్దాక్షిణ్యంగా చంపేశారు… వాళ్లను వెనకేసుకొచ్చే వ్యక్తి ఈ ముఖ్యమంత్రి. తనను చంపేస్తామని బెదిరిస్తున్నారని వివేకా కూతురు డాక్టర్ సునీత చెబుతుంటే, ఇలాంటి వ్యక్తి అర్జునుడితో పోల్చుకుంటున్నాడు. ఎవరు అర్జునుడో, ఎవరు కౌరవులో నేను మహాభారతం స్థాయికి వెళ్లి మాట్లాడదలుచుకోలేదు.
నన్ను వ్యక్తిగతంగా ఎన్నిసార్లు తిట్టినా, ఎన్ని రకాలుగా మాట్లాడినా ఎందుకు బాధ్యతగా ఉన్నానంటే, రాబోయే తరాలకు ఎంతో కొంత విలువలతో కూడిన రాజకీయం చూపించడానికి” అంటూ పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఇది కలియుగం. అందులో ఒకటో పాదమో, రెండో పాదమో తెలియదు కానీ… మనం ఎవ్వరం కూడా శ్రీకృష్ణుడితో, అర్జునుడితో, కౌరవులతో పోల్చుకోవద్దు. మీరు జగన్, మీది వైసీపీ… నేను పవన్ కల్యాణ్, మాది జనసేన. ఎవరు మంచి వాళ్లు, ఎవరు అండగా నిలుస్తారు, ఎవరు దోపిడీదారులో ప్రజలకు బాగా తెలుసు. స్వగతం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నేను ఏ రోజూ కూడా ఆయనను తగ్గించి ఎప్పుడూ మాట్లాడలేదు. కానీ సొంత చెల్లెలికి గౌరవం ఇవ్వలేని వాడు, మనింట్లో ఆడపడుచులకు గౌరవం ఇస్తాడని నేను అనుకోవడంలేదు. వైసీపీ ఉన్న చోటే ఇంత దిగజారుడు రాజకీయం ఉంటుంది. దేశంలో ఇంత దిగజారుడు రాజకీయం ఎక్కడా చూడలేదు.
ఇక, పవర్ స్టార్, పవర్ స్టార్ అంటారు… పవర్ లేని వాడికి పవర్ స్టార్ బిరుదు ఎందుకు? అని వ్యాఖ్యానించారు. పవర్ స్టార్ అనే పదం తనకు ఎబ్బెట్టుగా ఉంటుందని, తనను ప్రజల మనిషి అనుకోవడమే ఇష్టమని పేర్కొన్నారు. అందుకే సినిమాల్లో కూడా ఆ పదం వాడనని వెల్లడించారు.

మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సమక్షంలో మచిలీపట్నం ఎంపీ బాలశౌరి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. జనసేనాని పవన్ కండువా కప్పి బాలశౌరిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఎంపీతో పాటు ఆయన కుమారుడు అనుదీప్ కూడా జనసేనలో చేరారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ కీలక నేతలు నాదెండ్ల మనోహర్, నాగబాబు పాల్గొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదంటూ వైసీపీ పాలనపై ఆయన విమర్శలు గుప్పించారు. పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరడం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. పులిచింతల ప్రాజెక్టుకు సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదన్నారు. పవణ్ కల్యాణ్‌లో ప్రశ్నించే గుణం ఉందని, అందుకే ప్రభుత్వం ఉద్ధానం కిడ్నీ సమస్యను పరిష్కరించిందని అన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article