వేంపల్లె
వేంపల్లెలో ఆర్యవైశ్య అఫీసియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (అవోపా) ఆధ్వర్యంలో నేడు జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించామని అవోపా అధ్యక్షుడు బైరిశెట్టి వెంకట సునీల్ కుమార్ తెలిపారు.అధ్యక్షుడు వెంకట సునీల్ కుమార్,జాయింట్ సెక్రటరీ కొప్పరపు శివకిరణ్ మాట్లాడుతూ మోహన్‌దాస్ కరంచంద్ గాంధీజీ సామాజిక కార్యకర్త మరియు రచయిత. భారతదేశంలోని బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జాతీయవాద ఉద్యమానికి నాయకుడిగా మారారని అన్నారు,ఆ విధంగా అతను తన దేశానికి తండ్రిగా పరిగణించబడ్డాడన్నారు. గాంధీ తన సిద్ధాంతానికి అంతర్జాతీయంగా గౌరవించబడ్డాడని,రాజకీయ మరియు సామాజిక పురోగతిని సాధించడానికి అహింసాత్మక నిరసన చేపట్టారని తెలిపారు,
ఒక భారతీయ న్యాయవాది, వలసవాద వ్యతిరేక జాతీయవాది,రాజకీయ నీతివేత్త,అతను బ్రిటిష్ పాలన నుండి భారతదేశానికి స్వాతంత్ర్యం కోసం విజయవంతమైన ప్రచారానికి నాయకత్వం వహించడానికి అహింసాత్మక ప్రతిఘటనను ఉపయోగించాడని తెలిపారు. అతను ప్రపంచవ్యాప్తంగా పౌర హక్కులు మరియు స్వేచ్ఛ కోసం ఉద్యమాలను ప్రేరేపించాడని అన్నారు. బ్రిటిష్ పాలన నుండి భారతదేశానికి స్వాతంత్ర్యం కోసం ప్రచారానికి నాయకత్వం వహించారని తెలిపారు.ఈ కార్యక్రమంలో అవోపా కార్యవర్గ సభ్యులు,ఆలయ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు