Friday, November 29, 2024

Creating liberating content

తాజా వార్తలుఆదివాసీల రాష్ట్ర మన్యం బంద్ విజయవంతం

ఆదివాసీల రాష్ట్ర మన్యం బంద్ విజయవంతం

ఆదివాసి స్పెషల్ డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలి
జీవో నెంబర్ 3 రిజర్వేషన్ చట్టబద్ధతకై టీఏసి ఆమోదించిన నూతన రెగ్యులేషన్ ముసాయిదాను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించాలి
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులందరికీ పునరావాస ప్యాకేజీ ఇవ్వాలి
అటవీ భూముల చట్ట సవరణను రద్దు చేయాలి
పోడు భూములకు పట్టాలి ఇవ్వాలి

వీ.ఆర్.పురం :ఏజెన్సీ ప్రాంత ఉద్యోగాలు 100% ఆదివాసిలకే ఇవ్వాలని, జీవో నెంబర్ 3 చట్టబద్ధతకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆర్డినెన్స్ జారీ చేయాలని, పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని, తదితర సమస్యల సాధన కోసం, ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో చేస్తున్న రాష్ట్ర మన్యం బందు ఆదివారం మండలంలో విజయవంతమైంది. రాష్ట్ర మన్యం బంద్ సందర్భంగా రేఖపల్లి ప్రధాన కూడలి వద్ద గిరిజనులు రాస్తారోకో నిర్వహించారు. వాహనాలను తిరగనివ్వకుండా నిలువరించారు, అదేవిధంగా మన్యం బందుకు మద్దతుగా మండలంలోని దుకాణాలు, హోటల్లు, చిన్న చిన్న వ్యాపారస్తులు తమ దుకాణాలను మూసివేసి బందుకు మద్దతును పలికారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం మండల కార్యదర్శి పూణెం ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంత స్థాయికి ఆదివాసి నిరుద్యోగులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని మొన్న ఏకలవ్య పాఠశాలలో నియమాకాలు, నిన్న ఐసిడిఎస్ లో నియమాకాల్లో గిరిజనేతరులతో భర్తీ చేశారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 6100 డిఎస్సి ఉపాధ్యాయ పోస్టుల్లో, 1025 పోస్టులు గిరిజన సంక్షేమ శాఖ కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఐటీడీఏ పరిధిలో 517 టీచర్ పోస్టులు నోటిఫై చేశారని, ఇందులో 38 టీచర్ పోస్టులు మాత్రమే ఆదివాసులకు కేటాయించారాని వాపోయారు. ఆదివాసి ప్రాంతంలో ఐదు శాతం నివాసం ఉన్న గిరిజన నేతరులకు 95% ఉద్యోగాలు, 95 శాతం నివాసం ఉంటున్న ఆదివాసీలకు ఐదు శాతం పోస్టులు, జగన్ ప్రభుత్వం చర్యల వలన ఆదివాసీ యువత భవిష్యత్తు నాశనం కాబోతుందని, తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ మూడును చట్టబద్ధత కల్పించుటకు ఆర్డినెన్స్ తీసుకురావాలని, ఏజెన్సీలో 100% ఉద్యోగాలు ఆదివాసీలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే ఆదివాసి మాతృభాష వాలంటీర్లను రెవిన్యూల్ చేయాలని ఏపీ ప్రభుత్వం పోర్టల్ వెబ్ సైట్లో ఆదివాసి వాల్మీకి కొండ దొర తెగలను పునరుద్ధరణ చేయాలని, నాన్ షెడ్యూల్ 1500 ఆదివాసి గ్రామాలను షెడ్యూల్ ఏరియాలో చేర్చాలని, పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని, అటవీ భూముల చట్ట సవరణలు రద్దుచేసి పోడు భూములకు పట్టాలివ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి సోయం చిన్నబాబు, ఆదివాసీ నాయకులు పాయం రామారావు, పాయం లక్ష్మణ్, ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి సవలం రాజేంద్రప్రసాద్, సిపిఎం నాయకులు పంకు సత్తిబాబు, కుంజ నాగిరెడ్డి, తుర్రం బాబురావు, సర్పంచ్ వెట్టి లక్ష్మి, వడ్లాది రమేష్, హాజరత్, లక్ష్మణ్, ప్రకాష్, విశ్వనాథ్, సూరిబాబు, ప్రజానాట్య మండలి సిహెచ్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article