జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి
జీలుగుమిల్లి/ ఏలూరు :సార్వత్రికల ఎన్నికల అనంతరం ఈవీఎం ప్యాడ్ లను ఏలూరు సి ఆర్ ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈవీఎం బాక్స్ లు ఏలూరు జిల్లాలో ఉన్న ఎం. పి & అసెంబ్లీ నియోజకవర్గలకు చెందిన ఈవీఎం బాక్స్ లు భద్రపరిచి మూడు అంచుల భద్రత కల్పించిన పరిశీలన చేశారు.ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి ఐపీఎస్ వారు ఈవీఎం స్ట్రాంగ్ రూములో వద్ద భద్రత ను ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించినారు.ఈ సందర్భంగా ఈవీఎం స్ట్రాంగ్ రూముల వద్ద భద్రతను నిర్వహిస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ నిర్వహణలో అలసత్వం వహించకుండా అప్రమత్తతో ఉండాలని అలాగే స్ట్రాంగ్ రూముల వద్ద ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలు యొక్క పనితీరుల గురించి అధికారులకు తగిన సూచనలు మరియు సలహాలు ఆదేశాలు ఇచ్చినారు.ఎస్పీ తో పాటుగా ఏ.అర్ అదనపు ఎస్పీ శ్రీ ఎన్.ఎస్.ఎస్ శేఖర్ , ఏ .అర్ డిఎస్పీ శ్రీ శ్రీ హరి రావు ఎస్.బి ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు 3 టౌన్ ఇన్చార్జ్ ఇన్స్పెక్టర్ కే శ్రీనివాసరావు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.