Friday, November 29, 2024

Creating liberating content

రాజకీయాలుఉగ్ర గెలుపే మన లక్ష్యం కావాలి

ఉగ్ర గెలుపే మన లక్ష్యం కావాలి

  • దారపనేని పిలుపు

కనిగిరి :కనిగిరి నియోజకవర్గం పామూరు మండలం తూర్పు కోడిగుడ్లపాడు గ్రామపంచాయతీ పరిధిలోని పోతవరం గ్రామంలో జరిగిన నాగర్పమ్మ కొలుపుల్లో దారపనేని మాట్లాడుతూ త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కనిగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్న డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గెలుపే మన లక్ష్యం కావాలని అందుకు అందరం కలిసికట్టుగా పనిచేసి అఖండ మెజారిటీ సాధించేందుకు కృషి చేయాలని కనిగిరి ఏఎంసీ మాజీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్ కోరారు. మండలంలోని తూర్పు కోడిగుడ్లపాడు పంచాయతీ పరిధిలోని పోతవరం గ్రామంలో వెలసి ఉన్న శ్రీ నాగారప్పమ్మ దేవస్థానంలో అద్దంకి కొండయ్య, సతీమణి మాలకొండమ్మ కుమారుడు మహేంద్ర, మనోజ్, సోదరుడు మాజీ గ్రామపంచాయతీ సభ్యుడు అద్దంకి మాల్యాద్రి, మరియు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో సోమవారం కొలుపులు నిర్వహించారు. అద్దంకి వారు నాగారపమ్మ కొలుపులకు ముఖ్యఅతిథిగా పాల్గొని దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం నిర్వాహకులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం పంచాయతీ పరిధిలోని గ్రామాలకు చెందిన ప్రొద్దుటూరు, మైదుకూరు, కడప, అనంతపురం, విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాల నుండి సొంత గ్రామాల పంచాయతీలోకి వచ్చిన వారితో ముచ్చటించారు. ఈ సందర్భంగా దారపనేని మాట్లాడుతూ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అభివృద్ధికి పెద్ద పీట వేస్తారని అలాంటి సమర్థవంతమైన నాయకుడిని మనం అందరం ఏకతాటి పైన నిలబడి రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తు మీద ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించుకొని మన ప్రాంత అభివృద్ధికి పాటుపడదామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యులు చెనికల మాల కొండయ్య,దారపనని రాజేంద్రప్రసాద్, గడ్డం వెంకటరత్నం, కావిటి సుబ్బయ్య, పోకా నాయుడు, ఫిష్ రంతుల్లా,యరసింగు రాయుడు, గ్రామ మాజీ ఉపసర్పంచి అద్దంకి బాల నాగయ్య, మాజీ నీటి సంఘం అధ్యక్షులు అద్దంకి మాల్యాద్రి, అద్దంకి కొండయ్య, మిరియం గురవయ్య, నాగమల్లేశ్వరరావు, ఇండ్ల చెరువు లక్ష్మయ్య, అద్దంకి కోటయ్య, నాగేశ్వరరావు, చెనికల పెద్ద మాల కొండయ్య, గడిపూడి వెంకటేశ్వర్లు, తిరుపాలు, ఇర్ల జంగమయ్య, చిరయ్య, బండారు వెంగయ్య,అద్దంకి బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article