కడప సిటీ :
కడప నగరంలో ఆదివారం ఫిబ్రవరి 4 న ఎర్రముక్కపల్లి, బాల వికాస్ స్కూల్ దగ్గర గల దూదేకుల భవనంలో ఆయిల్ మిల్ ఓబులేసు ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన మెగా ఉచిత దూదేకుల వివాహ పరిచయ వేదిక. ఈ కార్యక్రమమునకు సుమారు 55 మందికి పైగా పెళ్లి కానీ యువతి యువకుల తల్లిదండ్రులు హాజరయ్యారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం నిర్వహించడం తమకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని ఇటువంటి కార్యక్రమాలు మునుముందు ఇంకా చేయాలని తల్లిదండ్రులు భవన కమిటీకి విన్నవించుకున్నారు. సంతోషకరమైన వాతావరణంలో వారి వివరాలు తెలుసుకోవడం జరిగినది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దూదేకుల ముఖ్య నాయకులు మన్నూర్ అక్బర్ , బాబయ్య , ఖాదరయ్య , హుస్సేన్ , అజంతా ఆర్ట్స్ హుస్సేన్ , అజ్మతుల్లా , ప్రజాశక్తి విలేఖరి నూర్ భాషా , దస్తగిరి , మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.