ఎవరిది ఈ జాతీయ జనసేన పార్టీ
ఆదాని, అంబానీ లు ఉన్నారా
జగన్నాటకములో భాగమేనా
ఎవరీ జగన్నాటక సూత్రదారి..
ప్రజా క్షేత్రంలో లేకుండానే ప్రజలతో మమేకమై…
కార్పొరేట్ స్థాయిలో నియామకాలు…
ఏపీ లో విస్తృతంగా దూసు కెళ్తూ..
దేశ రాజకీయాల్లో ఇదొక సంచలనమా
(అంకిరెడ్డిపల్లె రామమోహన్ రెడ్డి)
నాలుగు దుప్పట్లు పంచి,నాలుగు కూరగాయలు పంచి నాలుగు దిక్కులు పిక్కటిల్లెల్లా ప్రచారం చేసుకుంటున్న ఈ వర్తమాన రాజకీయ పరిస్థితులలో నవ్యాంధ్రప్రదేశ్ రాజకీయాలలో నూతన శఖానికి నాంది పలికి నూతన ఒరవడికి శ్రీకారం చిట్టి నూతనోత్సాహం తో పరుగులు పెట్టిస్తున్న నూతన రాజకీయ పార్టీ జాతీయ జనసేన.ఇప్పటికే నవ్యాంధ్రప్రదేశ్ రాజకీయాలు అనేక నాటకీయ పరిణామాల మధ్య నాట్య మాడుతుండగా నేడు కంటికి కనిపించకుండా కావాలిసిన వారిని కార్పొరేట్ స్థాయిలో నియామకాలు చేస్తూ కాకలు తీరిన రాజకీయ నాయకుల కళ్ళల్లో ఆందోళన కలిగిస్తున్న ఈ అదృశ్య శక్తి ఎవరా అన్నది ఇప్పుడు డాలర్ల ప్రశ్నగా మారింది.
ఎక్కడో నాలుగు గోడల మధ్య జరిగే సన్నివేశాలను సైతం బహిర్గతం చేసి నవ్వులు పాలు చేసి,చేస్తూ రాజకీయ పబ్బం గదుపుకుంటున్న ఈ వర్తమాన కాలంలో కూడా కొనింటి పవన్ కళ్యాణ్ పేరు తప్ప పూర్తీ స్థాయి వివరాలు కూడా తెలియడం లేదు. సమాజాన్ని ఉద్దరిస్తా, ప్రశ్నిస్తా అని పార్టీ స్థాపించిన కొణిదెల పవన్ కళ్యాణ్ ఏ చిన్న అడుగు వేసిన, 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం iam 40 years industry in politics అని చెప్పుకునే టీడీపీ అధినేత అడుగు తీసి అడుగు వేసే లోపు సమాచారాన్ని ఖండాలు దాటే కేకలు వేస్తున్న వైసీపీ వారు కూడా మౌనంగా ఉన్నారంటే ఇది జగన్మోహనుడి జగన్నాటకములో భాగమా అన్న భల మైన అనుమానం లేకపోలేదన్న చర్చ నడుస్తోంది. ఉత్తరాదిని శాసిస్తూ దక్షిణాది న పాగా వేయాలన్న లక్ష్యంతో తమకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటూ ఎప్పుడూ పళ్ళెత్తి మాట అనని వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని మళ్లీ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చో బెట్టడానికి ప్రపంచ పఠంలో కీర్తించబడుతున్న మోడీ అండతోనే ఇలా జరుగుతుందా అన్న అనుమానాలు రేకెత్తిస్తోంది. మోడీ జగన్ సంబంధ బాంధవ్యాలు గురించి ఈ దేశంలో అందరికి తెలిసిందే. వారి ప్రేమలు ఆప్యాయతలు. వీరిద్దరి కి కామన్ రాజకీయ శత్రువు అయిన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజకీయ పతనం కోసం ఆదాని, అంబానీ లాంటీ కార్పొరేట్ దిగ్గజాల సహాయ సహకారాలతో మోడీ అండతో ఈ అదృశ్య పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారా అన్న చర్చ భలంగా నడుస్తోంది. ఏది ఏమైనా కోనింటి పవన్ కళ్యాణ్ దెబ్బకి కొణిదెల పవన్ కళ్యాణ్ అబ్బా అంటుండగా ఒక పవన్ కళ్యాణ్ ను నమ్ముకున్న నాయుడు నూతన విధానాలు పాటిస్తూ ఉండగా ఇంకొక పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకున్న ఈ నాయకుడు నట్టేటమునుగుతానా నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవుతానా అన్న ధర్మ సందేహం తో నలిగిపోతున్నట్లు నేడు ప్రజల్లో చర్చ జరుగుతోంది.వేచిచూద్దాం.. కాలమే సమాధానం చెబుతుంది…