ప్రిన్సిపాల్ ఎం జగపతి రాజు
ప్రజాభూమి భీమవరం
భీమవరం ఎస్ ఆర్ కె ఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ అందనాపల్లి కుమార్ రాజా ఎన్ఐటి రాయపూర్ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో పీహెచ్డీ సాధించారని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం జగపతి రాజు మంగళవారం చెప్పారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ జగపతి రాజు కుమార్ రాజాను కళాశాల యాజమాన్యం తరఫున ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కుమార్ రాజా మాట్లాడుతూ ఎన్ఐటి రాయపూర్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేస్తున్న డాక్టర్ ఎం. బిస్వాల్ పర్యవేక్షణలో తాను రూపొందించిన ” సూపర్వైజర్ ఫస్ట్ జోన్ డిస్టెన్స్ ప్రొటెక్షన్ స్కీమ్ డ్యూరింగ్ పవర్ స్వింగ్” అనే అంశంపై తాను చేసిన పరిశోధనకు ఎన్ఐటి రాయపూర్ పిహెచ్డీ ప్రధానం చేసిందన్నారు. తనకు అవకాశం కల్పించిన కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపల్ డాక్టర్ జగపతి రాజు, త్రిబుల్ ఈఈ హెడ్ డాక్టరు బి ఆర్ కే వర్మలకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు. ఈ సందర్భంగా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ విభాగం హెడ్ డాక్టర్ బీఆర్కే వర్మ మాట్లాడుతూ తమ డిపార్ట్మెంట్లో 17 మంది పిహెచ్డి పూర్తిచేసిన అధ్యాపకులు ఉన్నారని త్వరలో మరో నాలుగు అధ్యాపకులు పీహెచ్డీ అవార్డు పొందేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా కుమార్ రాజా ను ఆయన అభినందించారు.