Sunday, December 1, 2024

Creating liberating content

Uncategorizedఏకశిలా ధ్వజస్తంభ ఊరేగింపు కార్యక్రమం

ఏకశిలా ధ్వజస్తంభ ఊరేగింపు కార్యక్రమం

టి.నరసాపురం.

చిన్న కాశీగా పేరుగాంచిన టీ నర్సాపురం లోని శ్రీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ధ్వజస్తంభ పున ప్రతిష్ట సందర్భంగా బుధవారం ఉదయం గ్రామ శివారు నుండి ఏకశిలా ధ్వజస్తంభం ను ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకువచ్చారు అనంతరం పండితులు పూజా కార్యక్రమం నిర్వహించి ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభాన్ని ఉంచారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ కమ్మిల రమేష్ రాజు మాట్లాడుతూ ఆలయంలో ధ్వజస్తంభం పున ప్రతిష్ట కార్యక్రమం ఫిబ్రవరి నెల 27వ తేదీ నుండి 29 వరకు మూడు రోజులు పాటు ధ్వజస్తంభ పున ప్రతిష్ట కార్యక్రమాలు 29వ తేదీ ఉదయం బ్రహ్మశ్రీ వెలవలపల్లి బాలసుబ్రహ్మణ్యం శర్మ ఆధ్వర్యంలో భక్తుల సహకారంతో ప్రతిష్ట కార్యక్రమం మరియు హోమములు అఖండ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరపనున్నట్లు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతాయని ఆలయ కమిటీ చైర్మన్ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article