Thursday, November 28, 2024

Creating liberating content

క్రీడలుఐపీఎల్ కి రిషబ్ పంత్ రెడీ

ఐపీఎల్ కి రిషబ్ పంత్ రెడీ

రిషబ్ పంత్ వచ్చేస్తున్నాడు. రోడ్డు ప్రమాదం కారణంగా ఏడాదికిపైగా ఆటకు దూరంగా ఉన్న పంత్.. ఐపీఎల్ 2024లో ఆడనున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రిక్కీ పాంటింగ్ ఈ విషయాన్ని వెల్లడించాడు. ఐపీఎల్‌లో ఆడే విషయంలో రిషబ్ పంత్ ఎంతో కాన్ఫిడెంట్‌గా ఉన్నాడని పాంటింగ్ తెలిపాడు.‘తాను ఐపీఎల్ ఆడతానని.. పంత్ ఎంతో కాన్ఫిడెంట్‌గా చెబుతున్నాడు. ఐపీఎల్ ప్రారంభానికి మరో ఆరు వారాల సమయం ఉంది. దీంతో అతడు వికెట్ కీపింగ్ చేస్తాడా..? ఢిల్లీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడా? సీజన్ మొత్తం ఆడగలడా? అనేది అప్పుడే చెప్పలేం’ అని పాంటింగ్ తెలిపాడు. రిషబ్ పంత్ ఇంకా గాయాల నుంచి కోలుకుంటున్నాడని రిక్కీ వెల్లడించాడు.
2022 డిసెంబర్ 30న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రిషబ్ పంత్.. అదృష్టం కొద్దీ బతికిపోయాడు. కారు మంటల్లో దగ్ధం కాగా.. పంత్ అందులో నుంచి దూకేశాడు. ఈ క్రమంలో పంత్ మోకాలు 180 డిగ్రీలు పక్కకు తిరిగింది. దీంతో లిగమెంట్ సర్జరీ నిర్వహించాల్సి వచ్చింది. మొదట డెహ్రాడూన్‌లో పంత్‌కు చికిత్స అందించారు. ఆ తర్వాత అతణ్ని ముంబైలోని కోకిలాబెన్ హాస్పిటల్‌కు తరలించి సర్జరీ నిర్వహించారు. దాదాపు 40 రోజులపాటు హాస్పిటల్‌కే పరిమితమైన పంత్.. కోలుకోవడానికి చాలా సమయం పట్టింది.క్రికెట్ ఆడటం కష్టమేనన్నంతగా గాయాలయ్యాయి. అయితే పట్టుదలతో కోలుకున్న పంత్.. మెల్లగా ఒక్కో అడుగేస్తూ మళ్లీ మామూలు మనిషయ్యాడు. గాయం నుంచి కోలుకున్నాక.. ఇది తనకు పునర్జన్మ అని పంత్ తెలిపాడు.కష్ట సమయంలో రిషబ్ పంత్‌కు బీసీసీఐ, ఢిల్లీ ప్రాంచైజీ అండగా నిలిచాయి. పంత్‌ ఆడలేకపోయినా.. కాంట్రాక్ట్ ప్రకారం రూ. 5 కోట్ల ప్యాకేజీ అందిస్తామని బీసీసీఐ అప్పట్లోనే ప్రకటించింది. అతడి చికిత్సకయ్యే ఖర్చు మొత్తాన్ని భరించింది. ఐపీఎల్‌ శాలరీ కూడా అతడికి లభించింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఆడే మ్యాచ్‌లకు పంత్ వచ్చి ఉత్సాహపరిచాడు. అతడు బాధపడకుండా, మానసికంగా కుంగిపోకుండా ఢిల్లీ యాజమాన్యం.. అన్ని విధాలా అండగా నిలిచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article