Saturday, November 30, 2024

Creating liberating content

తాజా వార్తలుఓట్ ఆన్ బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం

ఓట్ ఆన్ బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం

అమరావతి:ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి ఓట్ ఆన్ బడ్జెట్ కు బుధవారం ఆమోదం తెలిపింది. ఉదయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆధ్వర్యంలో సమావేశమైన కేబినెట్.. బడ్జెట్ కు లాంఛనంగా ఆమోద ముద్ర వేసింది. ఉదయం పదకొండు గంటలకు ఇటు శాసన సభలో, అటు మండలిలో ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది.అమరావతి సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో పలు అంశాలపై చర్చ జరిగింది. అనంతరం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వీటిలో ఇవాళ ప్రవేశపెట్టే బడ్జెట్ కు ఆమోదం తెలపడంతో పాటు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్నీ ఆమోదించారు. ఇవాళ్టి కేబినెట్ భేటీలో ముందుగా 2024-25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ఆమోదించారు. ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చర్‌ యూనివర్శిటీ పరిధిలో ఈ అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌ కళాశాల పనిచేయనుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ ప్రేవేట్‌ యూనివర్శిటీస్‌ యాక్ట్‌ 2016కు సవరణలు చేయడం ద్వారా బ్రౌన్‌ఫీల్డ్‌ కేటగిరిలో మూడు ప్రేవేట్‌ యూనివర్శిటీలకు అనుమతి ఇస్తూ కేబినెట్ మరో నిర్ణయం తీసుకుంది. అలాగే నంద్యాల జిల్లా డోన్‌లో కొత్తగా హార్టికల్చరల్‌ పుడ్‌ ప్రాసెసింగ్‌ పాలిటెక్నిక్‌ కాలేజ్‌ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ హార్టికల్చర్‌ యూనివర్శిటీ పరిధిలో హార్టికల్చరల్‌ పాలిటెక్నికల్‌ కళాశాల పనిచేయనుంది. అటు నంద్యాల జిల్లా డోన్‌లో వ్యవసాయరంగంలో రెండేళ్ల డిప్లొమా కోర్సుతో వ్యవసాయ పాలిటెక్నిక్‌ కాలేజీ ఏర్పాటుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.అన్నమయ్య జిల్లా రాజంపేటలో అన్నమాచార్య యూనివర్శిటీ, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గోదావరి గ్లోబల్‌ యూనివర్శిటీ, కాకినాడ జిల్లా సూరంపాలెంలో ఆదిత్య యూనివర్శిటీల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article