కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు. వై. విష్ణు ప్రీతమ్ రెడ్డి
కడప సిటీ
సోమవారం ఆరో తారీఖునాడుకాంగ్రెస్పార్టీకార్యాలయంలో విలేకర్ల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు విష్ణు ప్రియతమ రెడ్డి మాట్లాడుతూ
కడపనియోజవర్గంలో ఇప్పటి వరకు 15 ఎలక్షన్లు జరిగినవి. ఇప్పటి వరకు ఎప్పుడు లేని భయానక వాతావరణం ఈ ఎలక్షన్ వల్ల వచ్చింది
ఎందుకంటే పాలక మరియు ప్రతిపక్షంలో ఇరువురు కూడా ఒక్కరి మీద ఒక్కరూ విమర్శలు చేసుకోవడం. ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవడం గమనిస్తుంటే
ఈ ఎలక్షన్స్ వల్ల ఎంతమంది ఇబ్బంది పడతారో అన్నె పరిస్థితి కనిపిస్తుంది. ఇంత వరకు అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ, ప్రతిపక్ష నాయకులుగా ఉన్న నాయకులు కానీ చేసుకున్నటువంటి విమర్శలు ఇప్పుడు చూస్తున్నాం ఒకరి మీద ఒకరు వ్యక్తిగతంగా, అసభ్య పదజాలంతో దూషించుకోవడం కాంగ్రెస్ పార్టీగా మేము ఖండిస్తున్నాం. కడప నియోజవర్గం ఓటర్లు ఎంతో జ్ఞానులు ప్రతిదిగమనిస్తున్నారు మీరు హుందాగా వ్యవహరించకపోతే ఓటు రూపంలో మీకు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది కాంగ్రెస్ పార్టీగామేముఓటర్లకువిజ్ఞప్తిచేసేదిఏమనగా ఎవరైతే కడప నియోజవర్గాన్ని ప్రశాంతంగా ఉంచుతారో, కడప ప్రజలకు మేలు చేస్తారో గమనించి ఓటువేయగలరు.పోస్టర్లకు బ్యానర్లకు కొట్టుకోవడం మానేసి ప్రజలకు 2014 నుంచి చేరో ఒక్కసారి పాలించిన ప్రభుత్వాలు కడపకు చేసిన మేలు ఏమిటో శ్వేత పత్రం విడుదల చేయవలసినదిగా కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. టి.డి.పి హయాంలో బుగ్గవంక సుందరీకరణ ఎంత వరకు వచ్చింది అని ప్రశ్నిస్తున్నాము . వైస్సార్ సీపీ ప్రభుత్వంలో ఎం అభివృద్ధి చేసారో తెలపాలి. కాంగ్రెస్ పార్టీ కట్టించిన రిమ్స్ ఆసుపత్రి వేసిన రోడ్డు తప్ప ఈ ఇరుపార్టీలు చేసినమేలుఏమిలేదనితెలుపుతున్నాము. ప్రజాక్షేత్రంలో ఇరు పార్టీలకు ధీటుగా కడప కు చేసిన మేలు, చేయబోయే మేలు తెలిపి, ప్రజలను ఓటు అడిగే దైర్యం మాకు ఉంది. మరి మీకు అదే దైర్యం ఉందా అని మాట్లాడటంజరిగింది.
ఈ కార్యక్రమంలో నగర ఉప అధ్యక్షులు మధురెడ్డి, ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు బాబు, నగర నాయకులు మౌలానా,తలహ, నగర కార్యదర్శి లు సులోచన, వెంకట సుబ్బమ్మ, నగర మహిళా అధ్యక్షురాలు లావణ్య తదితరులు పాల్గొన్నవారు.