కనిగిరి
ప్రభుత్వ వైద్యశాలలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని కనిగిరి మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ అన్నారు.బుదవారం కనిగిరి ఏరియా ప్రభుత్వ వైద్య శాలను మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ ఆకస్మికంగా తనిఖీ చేసి చికిత్స పొందుతున్న వార్డులకు వెళ్లి రోగులను అందుతున్న వైద్య సహాయం గురించి రోగులను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైద్య రంగంలో దేశంలో మొదటి స్థానం కల్పించడం జరిగిందన్నారు.రోగులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా నాణ్యమైన వైద్య సేవల అందించాలని డాక్టర్స్ కు మరియు సిబ్బందికి ఛైర్మెన్ అబ్దుల్ గఫార్ ఆదేశించారు.
ప్రభుత్వ వైద్య శాలలో గత కొన్ని సంవత్సరాలు నుండి మత్తు డాక్టర్ లేని కారణంగా ఆపరేషన్స్ చేయలేక పోయారు. ప్రస్తుతము వైద్యశాల నందు మత్తు డాక్టర్ ఉన్నందు వలన ఆపరేషన్స్ సంఖ్య పెంచాలని డాక్టర్స్ కు చుచుంచారు.ఈ కార్యక్రమంలో వైద్యశాల సూపర్డెంట్ డాక్టర్ అబ్దుల్ కలాం,డాక్టర్ ఆంజనేయులు, డాక్టర్ చక్రవర్తి, వైద్యశాల వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.