హిందూపురం టౌన్
మున్సిపల్ పరిధిలోని రెండవ వార్డు చౌడేశ్వరి కాలనీలో శుక్రవారం కమ్యూనిటీ భవన నిర్మాణానికి నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త దీపిక మున్సిపల్ చైర్ పర్సన్ ఇంద్రజ భూమి పూజ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా తమ ప్రభుత్వం ముందుకెళుతున్నట్టు తెలిపారు గుత్తేదారు నిర్మాణ పనులను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు