పోరుమామిళ్ళ:
వేసవికాలం దగ్గర పడక ముందే విద్యుత్ కోతలతో అల్లాడుతున్న రైతుల కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరి స్థితిలో ఉన్నారని సిపిఐ జిల్లా కార్య వర్గ సభ్యులు వీరశేఖర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
కడపజిల్లా పోరుమామిళ్ళ పట్టణంలో ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ
గ్రామీణ ప్రాంతాలలోని 33/11 కె.వి లో విద్యుత్ సబ్ స్టేషన్ లు ఏర్పా టు చేయడంతో రైతులు సంతోష పడ్డారన్నారు. వేసవికాలంలో కూడా విద్యుత్ కోతలు ఉండవని అనుకో వడం జరిగిందన్నారు. కానీ దానికి భిన్నంగా వేసవికాలం ఆరంభంలోనే కరెంటు కోతలతో క్రాసింగ్ చొద్ద , మిరప, మొక్కజొన్న, వర్రీ, అరటి, బొప్పాయి, టమోటా, బెండ, మటిక వంటి పంటలు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారని, విద్యుత్ అధికారులు మొద్దు నిద్రను విడిచి ఎప్పటికప్పుడు రైతులకు ట్రాన్స్ ఫారంలు కు ఫీజులు పోవడం, లైన్లు సక్రమంగా విద్యుత్ అందకపోవడం, ఈ ఇబ్బందులను అధిగమించేందు కు రైతులకు విద్యుత్ అధికారులు ఎప్పటికప్పుడు , అవిన భావన సంబంధాలు కలిగి ఉండాలని అన్నారు. రైతులకు అందుబాటులో ఉండకపోతే విద్యుత్ అధికారుల సబ్ స్టేషన్ల వద్ద ఆందోళన చేపడతామని సిపిఐ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏరియా సహాయ కార్యదర్శి పిడుగు మస్తాన్, మండల కార్యదర్శి రవికుమార్, పివి రమణ, పట్టణ సహాయ కార్యదర్శి కేశవ, తదితరులు పాల్గొన్నారు.